Sudigali Sudheer: నీ కన్నా విష్ణుప్రియ అందంగా ఉంది… అందరి ముందు సుధీర్ పరువు తీసిన రోజా!

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కామెడీ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధీర్ ప్రస్తుతం వెండి తెరపై సినిమా అవకాశాలు దక్కించుకొని పలు చిత్రాలతో అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై ఎంతో బిజీగా ఉన్న సుడిగాలి సుధీర్ గురించి అందరికీ తెలిసిందే.మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఉన్నటువంటి సుదీర్ జబర్దస్త్ కార్యక్రమంలో ద్వారా అవకాశం దక్కించుకొని ప్రస్తుతం హీరోగా మారి పోయారు.ఇలా ఆయన హీరోగా మారినప్పటికీ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కార్యక్రమాన్ని మాత్రం వదలడం లేదు.

ఇకపోతే ప్రతి వారం ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న సుధీర్ ఈ వారం కూడా సరికొత్త కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సుడిగాలి సుదీర్ మంత్రగాడి వేషధారణతో అందరిని ఎంతగానో నవ్వించారు. ఇలా ఇలా మంత్ర గాడి వేషధారణలో సుడిగాలి సుదీర్ వేదికపైకి రాగానే అందరూ ఒక్కసారిగా నవ్వారు.

ఇక బుల్లితెర యాంకర్ గా ఒకప్పుడు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణు ప్రియ తాజాగా జబర్దస్త్ వేదికపై తళుక్కుమంది. సుడిగాలి సుధీర్ స్కిట్ లో భాగంగా విష్ణు ప్రియ ఎంట్రీ ఇవ్వడంతో వెంటనే రోజా కల్పించుకొని సుధీర్ కన్నా విష్ణు ప్రియ చాలా బాగుంది అంటూ అందరి ముందు సుదీర్ పరువు తీసింది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సుడిగాలి సుధీర్ స్కిట్ లో భాగంగా ఆటో రాంప్రసాద్ కూడా తనదైన శైలిలో కామెడీ పండించారు.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel