Mahesh babu mother died : సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాతృ వియోగం..!

Updated on: September 28, 2022

Mahesh babu mother died : గత కొంత కాలంగా తెలుగు చిత్ర సీమకు సంబంధించిన చాలా మంది నటులు చనిపోతున్నారు. టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. దాదాపు రెండేళ్ల నుంచి చాలా మంది నటులు, నిర్మాతలు, దర్శకులు ప్రాణాలు కోల్పోయారు. తాజూగా సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య, మిల్క్ బాయ్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించారు.

Super star krishna first wife and mahesh babu mother indira devi passed away
Super star krishna first wife and mahesh babu mother indira devi passed away

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. నిన్న రాత్రి చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే నెల రోజుల నుంచి ఇందిరా దేవి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి మహేష్, ఇతర కుటుంబ సభ్యులు తెలుసుకుంటూనే ఉన్నారు. కానీ వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు.

Mahesh babu mother died : మహేష్ బాబు ఇంట్లో విషాదం..

అయితే “ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేబాబు మాతృమూర్తి శ్రీమతి ఘట్టమనేని ఇందిరా దేవి కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. ఆవిడ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు అభిమానులు సందర్శన కోసం ఆమె పార్థివ దేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచి అనంతరం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరపనునున్నారు” అని కృష్ణ కుటుంబ సభ్ులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Read Also : Naga Chaitanya Marriage : చిరంజీవి చిన్న కూతురు శ్రీజతో నాగ చైతన్య పెళ్లంట..?!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel