Hero sumanth: వేణుకి కలిసిరానిది సుమంత్ కి ఎలా కలిసొచ్చిందో తెలుసా?

Hero sumanth: భారతీయ చిత్ర పరిశ్రమ అంటే బాలీవుడ్ మాత్రమే అని వినబడే రోజులు మారాయి. ఇండియన్ సినిమాఅంటే తెలుగు సినిమా అన్న రేంజ్ కు మనవాళ్లు ఎగబాకారు. మన తెలుగు సినిమాలకు దేశ విదేశాల్లో కూడా ఆదరణ ఉంది. ఒకప్పుడు హిందీ సినిమా రాజ్యమేలుతున్న వేళ హిందీ భాషల్లో నటించే స్టార్లను తమ సినిమాల్లోకి తీసుకుంటే బాగా మార్కెట్ చేస్కోవచ్చ్ని సౌత్ లో ఉన్న దర్శకనిర్మాతలు భావించేవారు. కానీ ఇప్పుడు మన స్టార్లను పెట్టుకొని మార్కెట్ చేస్కోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోలుగా రాణించలేకపోయిన కొంతమ ంది హీరోలు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్ లుగా నచించడానికి రెడీ అవుతున్నారు. ఒకప్పుడు హీరోలుగా చేసిన వేణు, సుమంత్ లు కూడా ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసి సత్తా చాటారు.

రామారావు ఆన్ డ్యూటీలో వేణు, సీతారామంల సుమంత్ కీలక పాత్రలు పోషించారు. ఎంతో గ్యాప్ తీస్కొని చేసిన రామారావు ఆన్ డ్యూటీ జూలై 29న విడుదలై ప్లాప్ అయింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అవుదాం అనుకున్న వేమ్ ఆశలను దెబ్బతీసింది ఆ చిత్రం. కానీ సుమంత్ నటించి చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సుమంత్ పాత్ర క్యారెక్టర్ కి ఎక్కువ, విలన్ కి తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ సినిమా హిట్ అవ్వడంతో ఈయనకు మంచి పేరు వచ్చింది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel