Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

R.K Roja: రోజా కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకున్నాడు సుడిగాలి సుధీర్..!

R.K Roja: గత పది సంవత్సరాల నుంచి బుల్లి తెరపై ప్రసారం అవుతూ మంచి ఆదరణ సంపాదించుకున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమాన

By Ramesh Babu

Published on: April 24, 2022 10:30 AM

Updated on: April 24, 2022 9:38 AM

---Advertisement---

R.K Roja: గత పది సంవత్సరాల నుంచి బుల్లి తెరపై ప్రసారం అవుతూ మంచి ఆదరణ సంపాదించుకున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమానికి రోజా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఎంతో కీలకంగా ఉన్నారు. అయితే రోజా కు మంత్రి పదవి రావడంతో ఇక పై ఈమె బుల్లితెర, వెండితెర పై నటించనని చెప్పారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి ఈమె గుడ్ బై చెప్పడంతో జబర్దస్త్ టీమ్ తనకు ఘనంగా వీడ్కోలు చెప్పారు.

rk rojaతాజా ఎపిసోడ్ లో జబర్దస్త్ నిర్వాహకులు మల్లెమాల వారు జబర్దస్త్ వేదికపై రోజాను ఘనంగా సత్కరించారు. ఇక ఈ ఎపిసోడ్ లో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ రోజాతో వారికి ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా సుడిగాలి సుదీర్ మాట్లాడుతూ తనకు మల్లెమాల వారితో ఎంత అనుబంధం ఉందో, రోజా గారితో కూడా అదే అనుబంధం, సపోర్ట్ ఉందని సుధీర్ రోజా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Advertisement

ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ రోజా కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.అలాగే ఆటో రాంప్రసాద్ కూడా రోజాతో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోజా మాట్లాడుతూ… ఆ భగవంతుడి ఆశీస్సులు, నగరి ప్రజల ఆశీస్సులు ఉండటం వల్ల ప్రస్తుతం తన కల నెరవేరిందని, సర్వీస్ చేయడం తనకు చాలా ఇష్టం అందుకే తనకెంతో ఇష్టమైన వాటిని కూడా పక్కన పెట్టాల్సి వస్తుందని ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.