Pragya jaiswal: మెన్నటి వరకు పూజా హెగ్డే.. నేడు ప్రగ్యా.. నెటిజెన్ల చేతిలో అయిపోయారుగా!

తమ ఉత్పత్తుల్ని ప్రజలకు దగ్గర చేసేందుకు హీరో, హీరోయిన్లు, క్రికెటర్లతో ప్రమేషన్లు చేయించుకుంటారు చాలా మంది వ్యాపారులు. అయితే మద్యం ఉత్పత్తులకు సంబంధించి మాత్రం ఎక్కువ శాతం హీరోలతోనే యాడ్స్ చేయించేవారు. అందులో భాగంగానే బాలకృష్ణ ఓటీటీ షో ద్వారా కూడా తన పేవరెట్ బ్రాండ్ కు ప్రచారం చేశారు. బాలీవుడ్ లో హీరోయిన్లు కూడా లిక్కర్ బ్రాండ్స్ కి ప్రచారకర్తలుగా పనిచేస్తారు. కానీ టాలీవుడ్లో ఆ సంప్రదాయం లేకపోయేది. కానీ ఇప్పుడు ఆ పద్ధతి మారింది.

హీరోయిన్ గా తన పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో అఖండ లో నటించి తన సత్తా చాటుకున్న ప్రగ్యా జైశ్వాల్.. తన కెరియర్ గ్రోత్ కోసం చాలా కష్టపడుతోంది. అందులో భాగంగానే బ్రాండ్ ప్రమోషన్లు, షాపింగ మాల్ ఓపెనింగ్స్ ఇలా ఏ ఛాన్స్ వచ్చినా వదులుకోవట్లేదు. అయితే ఇటీవలే ఆమె మద్యం బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ.. ఓ యాడ్ లో నటించింది. పక్కన పుల్ బాటిల్ పెట్టుకొని బ్లాక్ డ్రెస్ లో కనిపించింది. అయితే ఈ ఫొటోలు చూసిని నెటిజెన్లు ఇదంతా అవరసమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాగమని చెప్పడం సరికాదంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. అంతకు ముందు పూజా హెగ్డే కూడా ఇలాంటి ఓ యాడ్ లోనే నటించగా ఆమెపై కూడా నెటిడెన్లు దారుణమైన ట్రోల్స్ చేశారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel