Aishwarya Rai : ఆ బట్టలేంటి.. ఆ జుట్టు ఏంటి అంటూ మాజీ ప్రపంచ సుందరి ట్రోల్ చేస్తున్న నెటిజన్స్…!

Updated on: June 3, 2022

Aishwarya Rai : మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ అంటే తెలియని వారంటూ ఉండరు. ప్రతి యువకుడు ఐశ్వర్య రాయ్ అలాంటి అందమైన అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటారు. ఎన్నో ఏళ్లుగా తన అందంతో కుర్రాళ్ళకి నిద్రలేకుండా చేస్తోంది ఈ పిల్లి కళ్ళ సుందరి. 1994 లో మిస్ వరల్డ్ గా గెలుపొందిన ఐశ్వర్య రాయ్ ఎన్నో సినిమాలలో నటించింది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. వీరి ప్రేమకు గుర్తుగా ఒక పాప కూడా ఉంది.

Aishwarya Rai
Aishwarya Rai

కూతురు పుట్టిన తర్వాత కొంచం బొద్దుగా తయారైన ఐశ్వర్య మళ్లీ స్లిమ్ గా తయారయ్యింది. ఇకపోతే ఈమె మరింత అందంగా కనిపించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు..తాజాగా ఒక కాన్ఫరెన్స్ కు హాజరైన ఈమె గురించి నెటిజన్లు పెద్దఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐశ్వర్య డ్రెస్సింగ్ గురించి నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. డాక్టర్ కాన్ఫరెన్స్‌కు హాజరైన ఐశ్వర్య ఈ వేడుక కోసం వేసుకున్న డ్రెస్, ఆమె హెయిర్ స్టైల్ గురించి సోషియల్ మీడియాలో నెటిజన్స్ మద్య చర్చ జరుగుతోంది.

గత కొంత కాలంగా ఐశ్వర్య లుక్ గురించి నెటిజన్స్ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా డాక్టర్స్ కాన్ఫరెన్స్‌కు హాజరైన ఆమె వైట్ కలర్ డ్రెస్ లో మెరిసింది. ఈ వీడియో చుసిన నెటిజన్లు నీకు అసలు డ్రెస్ సెన్స్ ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు. గత కొంతకాలంగా ఆమెని ఒకే రకమైన బట్టలలో చూసిన నెటిజన్లు నీకు వెంటనే డిజైనర్ ని మార్చే అవసరం చాల ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.దేవుడు ఇంత అందాన్ని ఇచ్చాడు. దానికి తగ్గట్టు కాకుండా ఎప్పుడు రెగ్యులర్ ఔట్ ఫిట్ లో దర్శనమిస్తున్నావని అంటున్నారు. అయితే కొందరూ మాత్రం ఐశ్వర్యకి సపోర్ట్ చేస్తున్నారు. ఆమె ఎటువంటి బట్టలు వేసుకుంటే మీకెందుకు. అది ఆమె ఇష్టం అంటూ ఐశ్వర్యని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Read Also : Vikram Movie: విక్రమ్ మూవీ నటీ నటులు కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? కమల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్…!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel