KGF2 Chapter : కేజీఎఫ్2 తెలుగు వర్షన్‌ వంద కోట్లు… వంద శాతం అసాధ్యం..!

KGF2 Chapter : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కి ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లను దక్కించుకుని ఇండియన్ బాక్సాపీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాకు ఏ మాత్రం తగ్గేది లేదు అంటూ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాలో హీరోగా యశ్‌ నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. సినిమాలో కీలక పాత్రలో ప్రకాష్రాజ్ రావు, రావు రమేష్, సంజయ్ దత్‌, రవీనా టాండన్ ఇంకా పలువురు నటీనటులు నటించారు.

ఈ సినిమా తెలుగులో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రముఖ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అన్ని ఏరియాలకు కలిపి మరియు ఓవర్సీస్ తెలుగు వర్షన్ కలిపి దాదాపు 110 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని తెలుస్తోంది.

kgf-2-chapter-telugu-version-hundred-crores
kgf-2-chapter-telugu-version-hundred-crores

ఒక తెలుగేతర సినిమా ఇంత భారీగా తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ లు చేయడం ఇదే ప్రథమం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కే జి ఎఫ్ 2 సినిమా వంద కోట్ల వసూళ్లను దక్కించుకోవడం అంటే నూటికి నూరు శాతం అసాధ్యం అంటూ సినీ విశ్లేషకులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ప్రశాంత్ ఆ స్థాయి లేదు అంటున్నారు. కే జి ఎఫ్ 1 సినిమా నాలుగేళ్ల క్రితం వచ్చి తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ కే జి ఎఫ్ 2 సినిమా వంద కోట్ల వసూళ్లను తెలుగులో వసూలు చేస్తుందా అంటే మాత్రం నూటికి నూరు శాతం అసాధ్యమంటూ టాక్ వినిపిస్తుంది.

Advertisement

సినిమాకు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కినా.. అద్భుతం అంటూ టాక్ వచ్చినా కచ్చితంగా వంద కోట్ల వసూళ్లు అనేది మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే కే జి ఎఫ్ 2 సినిమా ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చే విధంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. కేజిఎఫ్ 2 సినిమా వంద కోట్ల బిజినెస్ చేయడం అవివేకము అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Kajal Aggarwal: బ్లాక్ ట్రెండీ వేర్ లో బేబీ బంప్ ఫోటో షూట్ తో రెచ్చిపోయిన కాజల్ అగర్వాల్… ఫోటోలు వైరల్!

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel