Acharya Movie : చిరు 152వ సినిమాను 152 థియేటర్లలో… ఏ సినిమానో అర్థమైంది కదా!

Updated on: April 11, 2022

Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రేక్షుకుల ముందుకు తీసుకు రాబోతోంది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసింది. సోషల్ మీడియాతో పాటు వెండి తెరపై కూడా ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించబోతున్నట్లు వివరించారు. అయిచే చిరుకు ఇది 152వ సినిమా కాబట్టి 152 థియేటర్లలో సినిమా ట్రైలర్ ను ప్రదర్శించబోతున్నారు. ఏప్రిల్ 12వ తేదీన సాయంత్రం 5.49 గంటలకు ట్రైలర్ విడుదల కాబోతుంది.

acharya trailer screening in 152 theatres
acharya trailer screening in 152 theatres

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. అయితే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే ముఖ్య పాత్రలు పోషించారు. ప్రొడ్యూసర్స్ నిరంజన్‌ రెడ్డి, అవినాష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. అయితే ఈ చిరు హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల గుండెల్లో నిలుస్తుందా లేదా తెలుసుకోవాలంటే మాత్రం ఇంకా కొన్నాళ్లు ఆగాల్సిందే.

Read Also : Alia bhatt ranabir kapoor marriage: ఆలియా, రణబీర్ పెళ్లి ఎక్కడ, ఎంత మంది వస్తున్నారో తెలుసా?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel