Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

R.K Roja : వామ్మో.. జబర్దస్త్ జడ్జిగా రోజా అన్ని కోట్లు సంపాదించారా?

R.K Roja : ఒకప్పుడు వెండితెర నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రోజా అనంతరం బుల్లితెర కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే జబర్దస్త్

By Ramesh Babu

Published on: April 25, 2022 1:10 PM

Updated on: April 25, 2022 12:51 PM

R.K Roja

---Advertisement---

R.K Roja : ఒకప్పుడు వెండితెర నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రోజా అనంతరం బుల్లితెర కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో కీలకంగా ఉన్నటువంటి రోజా గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఈమెకు మంత్రి పదవి రావడంతో తనకు మరిన్ని బాధ్యతలు పెరిగాయని,ఆ బాధ్యతలను నిర్వర్తించడం కోసం తనకు ఎంతో ఇష్టమైన నటనకు కూడా దూరం అవుతున్నారని వెల్లడించారు.

R.K Roja
R.K Roja

ఇక ఈ కార్యక్రమం నుంచి రోజా బయటకు వెళ్లడంతో ప్రస్తుతం ఈ కార్యక్రమానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు? ఈ కార్యక్రమం ద్వారా రోజా ఎంత సంపాదించింది? అనే విషయం గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం మొదట్లో రోజా ఒక్కో ఎపిసోడ్ కు తక్కువ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నారు.అయితే గత రెండు మూడు సంవత్సరాల నుంచి రోజా ఒక్కో ఎపిసోడ్ కు సుమారు 2నుంచి 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన రోజా సుమారు మూడు కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయం తెలిసి ఎంతో మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే మంత్రి పదవి వచ్చిన తర్వాత జబర్దస్త్ టీమ్ రోజాకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆమెకు జబర్దస్త్ వేదికపై సన్మానం చేసి జబర్దస్త్ కమెడియన్స్ ఘనంగా వీడ్కోలు పలికారు.

Read Also :R.K Roja: రోజా కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకున్నాడు సుడిగాలి సుధీర్..!

, ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

RELEATED POSTS :