Srikanth Reddy : కళ్యాణితో గొడవ.. అదిరిపోయే ఆఫర్ కొట్టేసిన శ్రీకాంత్.. వైరల్ అవుతున్న వార్తలు..!

Srikanth Reddy: యూట్యూబ్ లో అమ్మాయిలతో ఫ్రాంక్ వీడియోలు చేస్తూ శ్రీకాంత్ రెడ్డి పాపులర్ అయ్యాడు. ఇటీవల నటి కరాటే కళ్యాణితో గొడవ జరిగిన కారణంగా శ్రీకాంత్ రెడ్డి మరింత పాపులర్ అయ్యాడు. అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నాడన్న కారణంతో కరాటే కళ్యాణి అతని ఇంటి వద్దకు వెళ్లి శ్రీకాంత్ రెడ్డి తో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డిని కొట్టడంతో అతను కూడా ఆమె మీద దాడి చేశాడు. వీరీ గొడవకు సంబంధించిన వీడియో కూడా యూట్యూబ్ లో ప్రస్తుతం వైరల్ గా మారింది.

వీరిద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో పోలీసులు ఇద్దరు మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యూట్యూబ్ వీడియోతో పాపులర్ అయిన శ్రీకాంత్ రెడ్డి కరాటే కళ్యాణితో గొడవ కారణంగా మరింత పాపులర్ అవడంతో అతనికి ఒక బంపర్ ఆఫర్ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన షణ్ముఖ్, సిరి, దీప్తి సునయన, యాంకర్ శివ వంటివారు బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేయటానికి అవకాశం దక్కించుకున్నారు.

ఇటీవల శ్రీకాంత్ రెడ్డి కూడా వార్తల్లో నిలవడానికి నిలవడంతో బిగ్ బాస్ సీజన్ 6 లో శ్రీకాంత్ రెడ్డికి అవకాశం దక్కిందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ సిక్స్ కోసం కంటెస్టెంట్ ల కోసం గాలింపు మొదలు పెట్టిన బిగ్ బాస్ యాజమాన్యం శ్రీకాంత్ రెడ్డిని సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ విషయం ఎంతవరకు నిజం అన్న దాని గురించి క్లారిటీ లేదు. శ్రీకాంత్ రెడ్డి ఇలా ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయి బిగ్ బాస్ లో పాటిస్పేట్ చేసే అవకాశం దక్కించుకున్నాడో లేదో తెలియాలి మరి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel