Ajay : 8వ వారం ఎలిమినేట్ అయిన అజయ్.. వెళ్తూ వెళ్తూ అఖిల్ కి బాధ్యతలు అప్ప చెప్పిన అజయ్!

Ajay : బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం 8వ వారం కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోని 8వ వారం అందరూ ఊహించిన విధంగానే అజయ్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ అజయ్ పేరును తెలపగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఒక్కసారిగా షాకయ్యారు. ఇక అషు రెడ్డి అయితే అక్కడే కుప్పకూలిపోయి కుమిలి కుమిలి ఏడ్చింది. ఇక అజయ్ హౌస్ సభ్యులందరికీ వీడ్కోలు పలుకుతూ బిగ్ బాస్ వేదిక పైకి వచ్చారు.

Ajay
Ajay

ఈ విధంగా వేదికపైకి వచ్చిన అజయ్ కి నాగార్జున ఒక టాస్క్ ఇచ్చారు.ఈ టాస్క్ లో భాగంగా హౌస్ సభ్యులకు ఫుల్ హార్ట్, బ్రోకెన్ హార్ట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే అఖిల్, అషూ, నటరాజ్ మాస్టర్, మిత్రా, బిందులకు ఫుల్ హార్ట్ ఇచ్చాడు.ఇక మిగిలిన వారికి బ్రోకెన్ హార్ట్ ఇచ్చారు. ఈ టాస్క్ అనంతరం అజయ్ అఖిల్ తో మాట్లాడుతూ అతనికి పలు సూచనలు చేశారు.స్ట్రాంగ్‌గా ఉండు.. అషూని చూసుకో.. అది కొంచెం పిచ్చిది.. అంటూ చెప్పుకొచ్చారు. ఇక అషూ రెడ్డి గురించి మాట్లాడుతూ.. ఎక్కువగా అలగకు, నీకు బ్రెయిన్ ఎలాగో లేదు, హార్ట్ అయినా వాడు అంటూ తనని నవ్వించారు.

ఇక నటరాజ్ మాస్టర్, మిత్ర శర్మకు కూడా పలు సూచనలు చేశారు.బిందు మాధవి గురించి మాట్లాడుతూ బిందు ఎవరేమన్నా పెద్దగా పట్టించుకోరు కానీ నేను ఏమైనా మాట్లాడినా నా గురించి పట్టించుకుంటుంది. తను ఎలా ఉంది? తనకు కోపంలో ఉందా? సంతోషంగా ఉందా అనే విషయం తన కళ్ళల్లోనే
తెలిసిపోతుందని అజయ్ వెల్లడించారు. మొత్తానికి అయిదుగురు నామినేషన్ లో ఉండగా అజయ్ 8వ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు.

Advertisement

Read Also :Big Boss Non Stop Telugu : 8వ వారం ఎలిమినేట్ కానున్న కంటెస్టెంట్ అతనే.. ఓటింగ్ లో వెనుకబడ్డ అజయ్?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel