Balayaiah Comments : బాలయ్య కామెంట్స్‌తో ప్రకంపనలు.. టీడీపీకి మరో తలనొప్పి..!

Balayaiah Comments : తెలుగు సినీ ఇండస్ట్రీలోని సీనియర్ టాప్ హీరోల్లో ఒకరు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఈయన మూవీస్‌తో పాటు ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అనే ఓ ప్రోగ్రాం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. అందులో బాలయ్య చేసిన కామెంట్ ప్రస్తుతం టీడీపీకి తలనొప్పిగా మారుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ వెన్నుపోటు వల్ల చనిపోలేదని, గుండెపోటుతో చనిపోయారని ఆయన ఎమోషనల్ అయ్యారు.

కానీ వెన్నుపోటు వల్ల ఆయన మరణించారని తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా తాను ఎమోషనల్ అవుతానని చెప్పొకొచ్చాడు బాలకృష్ణ. ఎప్పుడో సుమారు 37 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని మళ్లీ బయటకు తీసినట్టయింది. దీంతో వైసీపీ నేతలు బాలకృష్ణ కామెంట్స్‌కు సోషల్ మీడియాలో కౌంటర్స్ ఇస్తున్నారు.

అయితే ఆ ఫ్రోమోలో నేను ఎన్టీఆర్ వారసుల్లో ఒకడినని, ఆయన ఫ్యాన్స్‌లో ఒకడినని చెప్పుకొచ్చారు బాలయ్య. అయితే ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో కౌంటర్స్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. ఎన్టీఆర్ గుండెపోటుతో మరణించారని మరి ఆ గుండెపోటుకు కారణం వెన్నుపోటు కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనను ఎలా మోసం చేశాడో.. ఎలా వెన్నుపోటు పొడిచాడో వివరించిన ఎన్టీఆర్ వీడియోలను షేర్ చేస్తున్నారు.

Advertisement

Balakrishna unstoppable Show on Aha 

ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చంద్రబాబే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని ఎన్టీఆరే స్వయంగా చెప్పారని స్పష్టం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై టీడీపీ నేతల నుంచి స్పందన కరువైంది. ఎదురు కౌంటర్ వేయడంలో ఫెయిల్ అవుతున్నారని టాక్. బాలయ్య కామెంట్స్ ఇంకా ఎంత వరకు దారితీస్తాయో మరి చూడాలి.

Read Also : Ys Jagan : 2024 ఎన్నికల్లో జగన్ దారెటు.. కేంద్రంలో ఏ కూటమికి మద్దతు..? 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

Join our WhatsApp Channel