RRR Movie : ఆర్ఆర్ఆర్ ఓటీటీ ప్రమోషన్లో భాగంగా నాటు నాటు స్టెప్పులతో రెచ్చిపోయిన దీప్తి సునయన దేత్తడి హారిక.. వీడియో వైరల్!

RRR Movie : రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 వ తేదీ థియేటర్లు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇకపోతే థియేటర్లో అన్ని భాషలలో ఎంతో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలో ప్రసారం అవుతూ మంచి ఆదరణ సంపాదించుకుంది.

RRR Movie
RRR Movie

జీ 5 ద్వారా ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇక ఈ సినిమాలో నాటు నాటు పాట ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది.ఇక ఈ పాటకు సంబంధించి ఎంతో మంది డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ పాటకు బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా, దేత్తడి హారిక మరోసారి నాటు నాటు స్టెప్పులతో రెచ్చిపోయారు.

 

Advertisement
View this post on Instagram

 

A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina)

Advertisement

అయితే అందరిలా సినిమాలో ఉన్న స్టెప్పులను కాకుండా సరికొత్త స్టైల్లో ఈ పాటకు డాన్స్ వేస్తూ ఈ డాన్స్ వీడియో ని అభిమానులతో పంచుకున్నారు. అయితే వీరిద్దరూ RRR సినిమాను ఓటీటీ ప్రమోషన్‌లో భాగంగా ఈ స్టెప్పులు వేస్తూ ఈ సినిమాని ప్రమోట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా వీరి డాన్స్ పర్ఫార్మెన్స్ ఎంతో మంది నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్ వేయండి.
Read Also :మళ్లీ ఒక్కటవుతున్న షన్నూ.. దీప్తి సునైనా.. ఇదిగో సాక్ష్యం..!

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel