Anchor shyamala: బుల్లితెర యాంకర్ గానే కాకుండా, సినీ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు యాంకర్ శ్యామల. తన అందం, అభినయం, యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ స్థానాన్ని సంపాదించుకుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు పంచుకుంటుంది. ఒకప్పుడు టీవీ సీరియళ్లలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె ఇతర ప్రోగ్రామ్స్ లో, ఎంటర్ టైన్ మెంట్ షో వైపు వెళ్లింది. నటిగా కెరియర్ ను స్టార్ట్ చేసినా కూడా యాంకర్ గా మంచి ఆదరణ సంపాదించుకుంది.
అయితే తాజాగా ఈ భామ ఓ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఈమె ఎంతో అందంగా గ్రేస్ తో డ్యాన్స్ చేసింది. క్రాప్ టాప్, లెహంగా వేస్కొని చిందులేసింది. ఆ డ్యాన్స్ చేయడం తనకు ఎంతో నచ్చిందంటూ పోస్ట్ చేసింది. ఇక ఆ డ్యాన్స్ చూసిన అబిమానులు మరో శ్యామలని ఫిదా అవుతున్నారు.
View this post on Instagram
Advertisement