Ashu Reddy: అషు రెడ్డి మొహంపై ఉమ్మిన యాంకర్ చైతూ.. కారణం అదే!

Updated on: March 2, 2022

Ashu Reddy: బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటల ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్ మధ్య టాస్క్ ల విషయంలో పెద్ద పోటీ ఏర్పడింది. ఇకపోతే ఈ కార్యక్రమానికి ఇది వరకే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లు కూడా పాల్గొన్నారు అయితే బిగ్ బాస్ వీరిని చాలెంజర్స్, వారియర్స్ గా విభజించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సీనియర్స్ ను చాలెంజర్స్ గా.. జూనియర్స్ ను వారియర్స్ గా నియమించి సీనియర్స్ పై ఆధిపత్యం చెలాయించే హక్కు జూనియర్స్ కి కల్పించారు బిగ్ బాస్. ఈ క్రమంలోనే యాంకర్ చైతు తనకు దాహం వేస్తుందని తనకు నీళ్లు కావాలని
అషు రెడ్డిని అడిగారు. ఈ క్రమంలోనే అషు రెడ్డి తనకు వాటర్ బాటిల్ తెచ్చి ఇవ్వడమే కాకుండా తనకు తాపించాలని సూచించాడు. దీంతో వాటర్ ఫ్లో ఎక్కువ కావటం వల్ల యాంకర్ చైతు ఒక్కసారిగా నోట్లో నీళ్ళు అన్నింటిని అషు రెడ్డి మొహం పై ఉమ్మాడు.

దీంతో ఒక్కసారిగా షాక్ అయిన అషు రెడ్డి కాసేపు అక్కడ సరదాగ ఇష్యూ చేసింది. దీంతో వెంటనే మేనేజర్ గా వ్యవహరిస్తున్న ముమైత్ ఖాన్ కి ఫిర్యాదు చేసింది. ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లో జూనియర్స్ కు సీనియర్ తో సేవలు చేసే అవకాశం కల్పించడంతో యాంకర్ చైతు
అషు రెడ్డిని ఓ ఆట ఆడుకున్నారు. ఇక ఈ వారం నామినేషన్లు ఉన్న వారిలో ఎవరు మొదటి వారం ఇంటి నుంచి బయటకు వెళ్తారో తెలియాల్సి ఉంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel