Raksha Bandhan 2022: ఈ ఏడాది రాఖీ పండుగ ఏరోజో తెలుసా, ఇలా చేయండి!

Raksha Bandhan 2022: రక్షా బంధన్ పండుగను ఈ ఏడాది ఏరోజు జరుపుకుంటారనే విషయంపై కొంద మందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. సాధారణంగా అయితే శ్రావణ మాసం పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. పంచాంగం ప్రకారం.. ఈసారి పౌర్ణమి తేదీ రెండు రోజులు ఉంది. అంటే ఆగస్టు 11, 12వ తేదీల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పండుగ ఏరోజు జరుపుకోవాలనే దానిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. పంచాంగం ప్రకారం అయితే శ్రావణ పూర్ణిమ 11వ తేదీ ఆగస్టు 2022 ఉదయం 10.38 గంటలకు ప్రారంభమై.. మరుసటి రోజు అంటే ఆగస్టు 12వ తేదీ 2022 ఉదయం 7.05 గంటలకు ముగుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టు 11వ తేదీన పండగ జరుపుకోవాలా లేదా 12న జరుపుకోవాలని అని ప్రజలు సందేహపడుతున్నారు.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 11వ తేదీన రక్షా బంధన్ జరుపుకోవాలని చెబుతారు. అయితే ఆగస్టు 11న తేదీన భద్ర కాలం నీట ఉండడంతో ఆగస్టు 12వ తేదీన జరుపుకోవాలని మరికొంత మంది చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో 12వ తేదీన రాఖీ కట్టడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మీరు ఆగస్టు 12న రాఖీ కట్టాలనుకుంటే ఉదయం 7.05 గంటల్లోపే రాఖీ కట్టండి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel