Palmistry : చేతిని చూసి మీకు పిల్లలు ఎంత మంది పుడతారో చెప్పొచ్చు.. మీరూ ఓసారి ట్రై చేయండి!

Updated on: April 20, 2022

Palmistry : పిల్లలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. చిన్న పిల్లలను చూడగానే అదో రకమైన మధురానుభూతి కలుగుతుంది. బుజ్జాయిలు చూడగానే ముచ్చటేస్తుంది. అమ్మ అని పిలిపించుకోవాలని చాలా మంది మహిళలకు ఉంటుంది. అలాగే తండ్రి అని పిలిపించుకోవాలని మగవారికి కూడా ఉంటుంది. పెళ్లయ్యాక ప్రతి ఒక్కరూ పిల్లల కోసం కలలు కంటారు. కొందరిలో తొందరగా సంతానం అందింతే చాలామందికి మాత్రం ఆలస్యం సంతానం అందుతుంది. ఎవరికైనా ఎంతమంది సంతానం కలుగుతారో చేతిలోని రేఖల ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. హస్తసాముద్రికా శాస్త్రం ప్రకారం పరిశీలిస్తే.. చేతిలోనే సంతాన రేఖలను గుర్తించవచ్చు చిటికెన వేలికి కింద కనిపించే వివాహ రేఖకు పైన సంతాన రేఖలు ఉంటాయని హస్త సాముద్రిక శాస్త్రం చెబుతోంది. హస్తసాముద్రిక జ్యోతిషం ప్రకారం చేతిలోని ఈ రేఖల ద్వారా ఎంత మంది పిల్లలు కలగవచ్చో చెప్పవచ్చు.

బుధ గ్రహమే సంతానికి గుర్తు :
సాముద్రిక శాస్త్రం ప్రకారం.. మీ అరచేతిలోని చిటికెన వేలి కింద భాగంలో పరిశీలించి చూస్తే అక్కడ బుధ గ్రహం ఉంటుంది. ఈ గ్రహం మనకు పుట్టుబోయే సంతానం గురించి తెలియజేస్తుంది. చేతిలోని సంతాన రేఖ ఎలాంటి అడ్డంకులు లేకుండా తిన్నగా ఉంటే పుట్టబోయే పిల్లల జీవితాలు ఆటంకం లేకుండా సాగిపోతాయని శాస్త్రం చెబుతోంది. అలా కాకుండా అస్తవ్యస్తంగా ఉంటే జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Palmistry
Palmistry

ఇలా ఉంటే.. నలుగురి కన్నా ఎక్కువ  సంతానం :
మీ అరచేతిలో కనిపించే బుధ గ్రహ రేఖ పొడువుగా ఉన్నట్టు అయితే అది ఎక్కువ మందిలో నలుగురు కన్నా ఎక్కువ మంది సంతానం పుడతారని అర్థం. అయితే అందులో బాలికల కంటే బాలురే ఎక్కువ ఉంటారట. అలాగే వారు ఉన్నత చదువులు చదువుతారు. చదువుతో పాటు సంస్కారం కూడా వారికి ఉంటుంది. ప్రతి ఒక్కరితో ఎంతో సభ్యతగా ఉంటారు. ఇంద్ర గ్రహానికి సంబంధించిన చేతిరేఖ పొడవుగా ఉంటే సంతానం ఒకరు మాత్రమే పుడతారని అర్థం. అయితే పుట్టే బిడ్డ సుగుణాలతోపాటు బాధ్యతయుతమైన వ్యక్తిగానూ వ్యవహరిస్తాడు. అర చేతిలోని సంతాన రేఖ బలంగా ఉంటే పిల్లల నుంచి తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమను పొందుతారు.

Advertisement

సంతాన రేఖలలో మీ చేతిలో ఏదైనా ఒక రేఖ స్పష్టంగా కనిపిస్తే మాత్రం.. ఆ పిల్లల్లో ఒకరిని మీరు చాలా ప్రత్యేకంగా చూసుకుంటారట.. వారికి మరింత చేరువవుతారు. దంపతుల్లో ఒకరికి అరచేతిలో సంతాన రేఖ లేకపోయినా పిల్లలు ఉండరని అనుకోడానికి వీలు లేదు. భార్య లేదా భర్త చేతిలో సంతాన రేఖ ఉంటే ఆడ పిల్లలు పుడతారు. చేతి రేఖలు కూడా పిల్లల లక్షణాలను తెలుసుకోడానికి సహాయపడతాయి. మీ అరచేతిలో సంతాన రేఖ విశాలంగా ఉన్నవారిలో మగ సంతానం పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది భర్త లేదా భార్యా అరచేతిలో సంతాన రేఖలు చూడటానికి ఎవరికి స్పష్టంగానూ లేదా విశాలంగా ఉంటాయో పిల్లల్లో వారికి చాలా దగ్గరవుతారు.

వీరికి ఆడపిల్ల పుట్టే అవకాశం :
చేతిలో రేఖలు బాగా ఇరుకుగానూ, ఒకదానికొకటి సమాంతరంగా సాగితే వీరికి ఆడపిల్ల పుడుతుంది. సంతాన రేఖలు స్పష్టంగానూ, బలంగానూ ఉంటే పుటే పిల్లలు బలవంతులు, సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని శాస్త్రం ఘోషిస్తోంది. సంతాన రేఖలో ఒకటి పొడుగ్గా లేదా స్వచ్ఛంగా ఉంటే వీరి పిల్లల్లో ఒకరు తల్లిదండ్రులు, వారి సోదరులకు ప్రియమైనవారుగా ఉంటారట. కట్టుకున్న భర్త చేతికి ఉండే సంతాన రేఖలు స్పష్టంగా కనిపించాలి. అప్పుడే వాళ్లు గొప్ప తండ్రిగానే కాదు.. తమ పిల్లలను అత్యంత ఇష్టపడే తండ్రిగా నిలుస్తారు. అరచేతిలోని సంతాన రేఖలు వంకరగా, అడ్డంకులు ఎక్కువగా ఉంటే మాత్రం.. వారికి పుట్టే సంతానం చాలా బలహీనంగా ఉంటారని అర్థం చేసుకోవాలి. ఇక రాబోయే కాలంలో వైద్యపరంగా అనేక అనారోగ్య సమస్యలను సైతం ఎదుర్కోవాల్సి రావొచ్చు.

Read Also : Palmistry : అరచేతిలో ఈ గీత ఉంటే విదేశాలకు వెళ్తారు.. ఉందో లేదో చూసుకోండి

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel