Money plant : మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా.. అయితే ఈ నియమాలు పాటిస్తేనే ప్రయోజనం

Updated on: May 23, 2022

Money plant : చాలా మంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ ఉంటుంది. కొందరు దీనిని ఇంటి అందానికి పెట్టుకుంటారు. మరికొందరు మంచి జరుగుతుందని పెంచుకుంటారు. ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుందని ఆశిస్తూ మనీ ప్లాంట్ పెంచుకుంటారు. చాలా మందికి వీటిని ఎలా పెంచాలో తెలిసే ఉంటుంది. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం ఏమిటంటే దానిని పెంచే పద్ధతి. పెంచడం వేరు, పద్ధతిగా పెంచడం వేరు. ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా మనీ ప్లాంట్ విషయంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవి కచ్చితంగా పాటిస్తేనే మనీ ప్లాంట్ వల్ల ఉపయోగం ఉంటుంది.

Money plant
Money plant

మనీ ప్లాంట్ కు సంబంధించి వాస్తు శాస్త్రంలో ప్రత్యేక సూచనలు ఉన్నాయి. వీటికి అనుగుణంగా మనీ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చిట్కాలు పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. మనీ ప్లాంట్ ను ఎవరికైనా బహుమతిగా అసలే ఇవ్వకూడదు. చాలా మంది మనీ ప్లాంట్ ను ఇంటి బయట పెట్టి పెంచుతుంటారు. కానీ మనీ ప్లాంట్ ను ఇంట్లోనే పెంచాలి. అలాగే మనీ ప్లాంట్ ను నేలకు ఎత్తున పెంచాలి. నేలపై ఎట్టి పరిస్థితుల్లో పెంచకూడదు. పైన కుండీని వేలాడి దీసి లేదా వాటర్ బాటిల్ లో మనీ ప్లాంట్ ను పెంచుకోవాలి. ఏదైనా కారణాల వల్ల మనీ ప్లాంట్ ఎండిపోయినట్లైతే.. దానిని వీలైనంత త్వరగా ఇంటి నుండి బయట పడేయాలి. దానిని ఇంట్లో ఎక్కువ కాలం అస్సలే ఉంచుకోకూడదు.
Read Also : Shani jayanthi : శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి.. శని జయంతి ప్రత్యేకం

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel