Vastu Shastra: వాస్తు శాస్త్రం ప్రకారం స్వస్తిక్ గుర్తును ఎక్కడ వేయాలో తెలుసా?

Updated on: July 5, 2022

Vastu Shastra : హిందూ ధర్మ శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మనం ఎలాంటి చిన్న పనులు చేసిన ప్రతి ఒక్క విషయంలోనూ వాస్తు శాస్త్రాన్ని గమనిస్తూ పనులను ప్రారంభిస్తాము. వాస్తు శాస్త్రం ప్రకారం పనులు చేయటం వల్ల మనం చేసే పనులలో విజయం కలుగుతుందని భావిస్తారు. ముఖ్యంగా స్వస్తిక్ చిహ్నాన్ని విజయానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ఏదైనా శుభకార్యాలు చేసే సమయంలో స్వస్తిక్ గుర్తును ముందుగా వేస్తాము. అయితే స్వస్తిక్ గుర్తు ఎక్కడ వేయాలి అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మరి స్వస్తిక్ గుర్తును ఎక్కడ వేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం…

do-you-know-where-to-place-the-swastik-symbol-according-to-vastu-shastra
do-you-know-where-to-place-the-swastik-symbol-according-to-vastu-shastra

విజయానికి ప్రతీక అయినటువంటి స్వస్తిక్ చిహ్నాన్ని ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ గుర్తు వేయడంతో ఇంటిలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. ఇంటి ద్వారంపై అష్టధాతువుల స్వస్తిక్ గుర్తు వేయాలి. లేదా రాగిణి కనుక ఉంచినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి దారిద్రం మొత్తం తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు నిల్వచేసే లాకర్ పై స్వస్తిక్ గుర్తు వేయటం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషించే లక్ష్మీ కటాక్షం కలిగేలా చేస్తుంది. ఇక లాకర్ లో కాస్త పసుపు కుంకుమ బియ్యం కలిపి ఒక వస్త్రంలో చుట్టి వేయటం వల్ల మన ఇంటికి లక్ష్మి ప్రవాహం ఉంటుంది.

ఇంటి ఆవరణంలో స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల మన ఇంట్లో ఎల్లప్పుడూ అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. చెక్కుచెదరకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ స్వస్తిక్ గుర్తుపై తమలపాకును ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం స్వస్తిక్ గుర్తును వేయడంతో అన్ని శుభాలే కలుగుతాయి.
Read Also : Vastu Tips : ఎంత సంపాదించినా ఆర్థిక ఇబ్బందులు తప్పటం లేదా? అయితే ఇలా చేయండి మంచి ఫలితం ఉంటుంది?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel