Lord Shani: శని దేవుని అనుగ్రహం పొందాలంటే శనివారం ఈ పనులు చేయాల్సిందే!

Lord Shani: శని దేవుడి పేరు చెబితేనే చాలామంది భయపడతారు.శని దేవుడు ఒక్కసారి తన ప్రభావం మనపై చూపితే కొన్ని సంవత్సరాల పాటు శని ప్రభావం ఉంటుందని అందుకే చాలామంది శని దేవుడిని పూజించడానికి వెనకడుగు వేస్తారు.నిజం చెప్పాలంటే శనీశ్వరుడిని పూజించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి శనీశ్వరుడు కేవలం ఎవరైతే తప్పు చేసి ఉంటారో అలాంటి వారికి కర్మకు తగ్గ ఫలితాలను మాత్రమే మనకు అందిస్తారు తప్ప శని ఎల్లప్పుడు తన అనుగ్రహాన్ని మనకు కలిగిస్తారు.

ఈ విధంగా శని దేవుడి అనుగ్రహం మనపై ఉండి మనకు సకల సంపదలు కలగాలంటే శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన శనివారం రోజు కొన్ని ప్రత్యేక పద్ధతులను పాటించడం వల్ల శనీశ్వరుని అనుగ్రహం మనపై కలిగి మనకు మంచి కలుగుతుంది.మరి శని దేవుడి అనుగ్రహం కోసం శనివారం ఎలాంటి పూజలు చేయాలి అనే విషయానికి వస్తే.. శనీశ్వరుడికి ఎంతో ఇష్టమైన రంగు నలుపు.అందుకే శనివారం రోజు నల్లని వస్త్రాలు ధరించడం వల్ల ఆయన కరుణాకటాక్షాలు మనపై ఉంటాయి.

అలాగే శనివారం నల్లని వస్త్రాలను ధరించి స్వామివారికి నీలిరంగు పుష్పాలను, నల్లటి నువ్వులు, నువ్వులతో తయారుచేసిన చలివిడి, ఆవాల నూనెను సమర్పించడం వల్ల శనీశ్వరుడు ఎంతో ప్రీతి చెందుతారు. అలాగే శనివారం మనకు వీలయినంతలో నల్ల నువ్వులు, నల్ల దుస్తులు, ఇనుప వస్తువులను దానం చేయటం వల్ల ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా శనివారం శనీశ్వరుని పూజించడానికి పొరపాటున కూడా ఎరుపు రంగు వస్తువులను, అలాగే రాగితో తయారుచేసిన వస్తువులను ఉపయోగించకూడదు. అంతేకాకుండా శనీశ్వరుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel