వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Devotional Tips: ఇంట్లో శంఖం పెట్టుకోవచ్చా… ఉంటే ఎలా పూజించాలో తెలుసా?

Devotional Tips: సాధారణంగా ఎంతోమంది ఇంట్లో శంఖాన్ని ఒక అలంకరణ వస్తువుగా పెట్టుకుంటారు. అయితే శంఖం ఒక అలంకరణ వస్తువు కాదు. ఆధ్యాత్మికంగా శంకువుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. కనుక శంఖువుని ఒక అలంకరణ వస్తువుగా కాకుండా ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన వస్తువుగా భావించాలి. ఎందుకంటే శంఖం లక్ష్మీదేవితో పాటు సముద్రగర్భం నుంచి ఉద్భవించింది. అందుకే గవ్వలను లేదా శంఖాన్ని లక్ష్మీదేవి తోబుట్టువులుగా భావించి పూజిస్తారు. ఈ విధంగా మన ఇంట్లో శంఖం ఉంటే దానిని పూజ ... Read more

By Ramesh Babu

Published on: March 3, 2022 8:21 AM

Updated on: March 3, 2022 8:21 AM

---Advertisement---

Devotional Tips: సాధారణంగా ఎంతోమంది ఇంట్లో శంఖాన్ని ఒక అలంకరణ వస్తువుగా పెట్టుకుంటారు. అయితే శంఖం ఒక అలంకరణ వస్తువు కాదు. ఆధ్యాత్మికంగా శంకువుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. కనుక శంఖువుని ఒక అలంకరణ వస్తువుగా కాకుండా ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన వస్తువుగా భావించాలి. ఎందుకంటే శంఖం లక్ష్మీదేవితో పాటు సముద్రగర్భం నుంచి ఉద్భవించింది. అందుకే గవ్వలను లేదా శంఖాన్ని లక్ష్మీదేవి తోబుట్టువులుగా భావించి పూజిస్తారు. ఈ విధంగా మన ఇంట్లో శంఖం ఉంటే దానిని పూజ గదిలో ఉంచి పూజించాలి.

పూజ గదిలో ఎల్లప్పుడు తెలుపు రంగులో ఉన్న శంఖం ఉండాలి. ఒక వెండి ప్లేట్ లో బియ్యం పోసి బియ్యం పై శంఖం ఉంచి శంఖానికి పూజ చేయాలి. ఇలా ప్రతిరోజు దూప దీపంతో శంఖాన్ని పూజించటం వల్ల సకల సంపదలు కలుగుతాయి. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలంటే ప్రతి శుక్రవారం అలాగే పౌర్ణమి అమావాస్య రోజు శంఖాన్ని అభిషేకం చేసే పూజించాలి. ఈ క్రమంలోనే ప్రతి శుక్రవారం లేదా పౌర్ణమి అమావాస్య రోజు పసుపు నీటితో శంఖం కడిగి అనంతరం పాలతో అభిషేకం చేయాలి.

అభిషేకం చేసిన తర్వాత పసుపు కుంకుమలతో శంఖాన్ని పూజించాలి. ఈ విధంగా పూజించడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండేలా కాపాడుతుంది. ఇంట్లో శంఖం ఉండటం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అయితే శంఖం ఇంట్లో ఉన్నప్పుడు ఆ శంఖాన్ని ఆధ్యాత్మిక వస్తువుగా భావించి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల ఎంతో మంచి కలుగుతుంది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel