Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Astro tips : నాగకేసరి పువ్వు ఒక్కటి చాలు.. లక్ష్మీదేవి కటాక్షం మీ వెంటే!

Astro tips : మన హిందూ సంప్రదాయం ప్రకారం చెట్లు, పూలు, ఆకులకు చాలా ప్రాధాన్యత ఉంది. దేవుడికి సమర్పించేందుకు వీటిని వినియోగిస్తుంటాం మనం. వాటి వల్ల దేవుడి కృప మన

By Vinod Kumar

Published on: November 16, 2023 11:27 PM

Updated on: November 16, 2023 11:28 PM

Astro tips

---Advertisement---

Astro tips : మన హిందూ సంప్రదాయం ప్రకారం చెట్లు, పూలు, ఆకులకు చాలా ప్రాధాన్యత ఉంది. దేవుడికి సమర్పించేందుకు వీటిని వినియోగిస్తుంటాం మనం. వాటి వల్ల దేవుడి కృప మనపై ఉంటుందని నమ్మకం. అయితే ఇందులో భాగంగానే నాగ కేసర మొక్కను ఇంట్లో నాటుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు.

మన ఇంట్లో ఉండే అన్ని రకాల సమస్యలను దూరం చేసి సంపదను సమకూరుస్తుందట. నాగకేసర మొక్క వల్ల కేవలం లక్ష్మీ దేవి కటాక్షం పొందడమే కాకుండా సమాజంలో మన గౌరవ, ప్రతిష్టలు పెరిగేందుకు కూడా తోడ్పడుతుందట.

Advertisement
Astro tips, నాగకేసరి పువ్వు ఒక్కటి చాలు
Astro tips, నాగకేసరి పువ్వు ఒక్కటి చాలు

అంతే కాకుండా ఆర్థిక అవరోధాలను తొలగించుకునేందుకు… ఏదైనా ఒక మాసం శుక్ల పక్షం శుక్రవారం రాత్రి ఒక చిన్న వెండి బాక్సులో నాగకేసర పువ్వు, కొంచెం తేనెను కలిపి మూసేయండి. ఆ తర్వాత బీరువాలో ఉంచండి. ఇలా చేసిన కొన్ని రోజుల్లోనే మీకు ఆర్థిక లాభాలు రావడం ప్రారంభం అవుతుంది.

దీపావళి రోజున కూడా ఇలా చేయవచ్చు. నాగకేసర పువ్వు శివుడికి చాలా ఇష్టం. కాబట్టి సోమవాడం భోళా శంకరుడికి పూజ చేసి ఈ పూలు సమర్పించం వల్ల మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే నాగకేసర చెక్కతో హోమం చేయడం వల్ల ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. దీని పొగ వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది.

Read Also : 

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.