Coconut Remidies: దృష్టి దోషం తొలగిపోవాలంటే.. కొబ్బరికాయతో ఈ పరిహారాలు పాటించాల్సిందే!

Updated on: November 6, 2023

Coconut Remidies : మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కొబ్బరికాయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొబ్బరిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండడమే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా కొబ్బరికాయను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.ఆ భగవంతుడు ఆశీర్వాదాలు పొందడం కోసం కొబ్బరికాయను దేవుడికి సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటారు. కేవలం దేవుడికి కొబ్బరికాయ సమర్పించడమే కాకుండా మనకు ఏవైనా దృష్టి దోషాలు ఉన్న ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కొబ్బరికాయతో ఈ చిట్కాలు పాటిస్తే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి.

if-you-want-to-get-rid-of-drust-dosam-and-follow-these-remedies-with-coconut
if-you-want-to-get-rid-of-drust-dosam-and-follow-these-remedies-with-coconut

మన ఇంట్లో ఎవరైనా దృష్టి దోషంతో బాధపడుతుంటే మంగళవారం కొబ్బరికాయ ఎరుపురంగు వస్త్రంలో చుట్టి ఆ వ్యక్తిపైఏడు సార్లు తిప్పి అనంతరం ఆంజనేయుడి పాదాల చెంత పెట్టడం వల్ల ఎలాంటి దృష్టిదోషం అయినా తొలగిపోతుంది అలాగే ఎలాంటి వ్యాధులు కూడా దరిచేరవు.ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు శుక్రవారం ఎరుపు రంగుదుస్తులు ధరించి లక్ష్మీదేవికి పూజ చేసిన అనంతరం ఒక కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి ఎవరికీ కనబడకుండా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఐశ్వర్యం మీ వెంటే వస్తుంది.

Coconut Remidies: దృష్టి దోషం తొలగిపోవాలంటే.. కొబ్బరికాయ దిష్టి పరిహారం…

ఇక వ్యాపార రంగంలో పనిచేసే వారికి వ్యాపారంలో అధిక నష్టాలు వస్తే గురువారం రోజు విష్ణు దేవుడు లక్ష్మీదేవికి పూజించాలి. ఈ విధంగా విష్ణు దేవుడికి పూజ చేసిన అనంతరం కొబ్బరికాయ, దారం, తెల్లని స్వీట్ ను పసుపు రంగు వస్త్రంలో ఉంచి విష్ణు దేవుడికి సమర్పించాలి. ఇలా ఎన్ని చేసిన దారిద్ర వెంటాడుతూ ఉంటే 7 శనివారాలు శనీశ్వరుడికి వెళ్లి నీటితో ఉన్న కొబ్బరికాయను సమర్పించి మరుసటి రోజు ఆ కొబ్బరికాయను నదిలో వేయాలి ఇలా చేయడం వల్ల శని దోషం కూడా తొలగిపోతుంది.

Advertisement

Read Also : Shiva Linga Puja Niyamas : శివలింగానికి ఇవి అస్స‌లు స‌మ‌ర్పించ‌కూడ‌దు.. ఎందుకంటే ? 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel