Crime: ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థి పై కన్నేసిన కామాంధుడు.. చివరికి..?

Crime: రోజురోజుకు మహిళలపై జరిగే అత్యాచారాలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. మహిళలపై జరిగే అత్యాచారాలు, లైంగిక దాడులు ఆగడం లేదు. ప్రభుత్వం మహిళల ఎన్ని చట్టాలు తెచ్చినా కుడా కామాంధులకు సరైన అడ్డుకట్ట వేయలేక పోతుండడంతో కామాంధులు మరింత రెచ్చిపోతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా వావి వరసలు మరచి మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం కాపవరం గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు సత్యవాడ సత్యనారాయణ ఆదివారం అందులో పాలెం గ్రామం నుంచి రెండు రోజుల క్రితం అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆరేళ్ల బాలికపై కన్నేశాడు. ఒకటో తరగతి చదువుతున్న ఆ బాలికకు తినుబండారాలు కొనిస్తాను అని చెప్పి బైక్ పై తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ బాలిక నోట్లో వద్దు బట్ట కుక్కి చిన్నారిపై అత్యాచారం చేశాడు. అనంతరం రక్తస్రావం అవుతున్న ఆ బాలికను కందులపాలెం నడిరోడ్డుపై వదిలిపెట్టి వెళ్లిపోయాడు.

వెంటనే ఆ బాలికను రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా విషయం తెలుసుకున్న రామచంద్రపురం సీఐ మీ శ్రీనివాస్ ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆ బాలికను తనపై అత్యాచారం జరిగిన ఘటన వివరిస్తూ ఎవరికైనా చెబితే చంపేసి కాలువలో లో పడేస్తాను అని బెదిరించినట్లు చెప్పడంతో సీఏ అవాక్కయ్యారు. ఈ సమాచారం అందుకున్న డిఎస్పీ బాలచంద్రారెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బాలిక పరిస్థితిని పరిశీలించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం కాకినాడ జిజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఆ బాలిక వివరాలు బంధువుల నుంచి సేకరించారు.ఆ బాలిక తల్లితో మాట్లాడి నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel