RRR Movie Release Date : RRR మూవీ విడుదల మార్చిలో కష్టమే.. ఎందుకో తెలుసా?!

Updated on: January 28, 2022

RRR Movie Release Date : పాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీ రిలీజ్ ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూనే ఉంది.. అదిగో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అని ప్రకటించగానే ఏదో కారణంతో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ ఆలస్యమవుతోంది. సంక్రాంతి బరిలో దిగాల్సిన ఆర్ఆర్ఆర్ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. దేశవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్, మెగా పపర్ స్టార్ రాం చరణ్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా మళ్లీ ఎప్పుడు విడుదల చేసేది ప్రకటించలేదు. అయితే ఇటీవలే RRR Team కొత్త రిలీజ్ డేట్ ఇదే అంటూ రెండు తేదీలను ప్రకటించింది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28నే RRR Movie Release ఉండొచ్చునని జక్కన్న అండ్ టీం ఫిక్స్ చేసినట్టుగా అధికారికంగా ప్రకటించారు. కరోనా తగ్గుముఖం పడితే.. మార్చిలో లేదా ఏప్రిల్ లోనే RRR movie రిలీజ్ చేస్తారా లేదో అనే చర్చలు నడుస్తున్నాయి. మార్చిలో ఈ మూవీ రిలీజ్ కావడం కష్టమేనని అనిపిస్తోంది.

RRR Movie Release : పునీత్ చివరి సినిమా జేమ్స్ రిలీజ్.. 

అందుకు బలమైన రీజన్ ఉందట..
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ నటించిన చివరి సినిమా జేమ్స్ మార్చి 17న రిలీజ్ కానుంది. జేమ్స్ (James Movie Release) విడుదల తర్వాత వారం రోజుల పాటు మరే సినిమా విడుదల చేయకూడదు.. పునీత్ చివరి సినిమా కావడంతో ఆయనకు నివాళిగా అక్కడి డిస్టిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో మార్చి 18న RRR మూవీ రిలీజ్ చేసినా కర్ణాటకలో RRR రిలీజ్ చేసే పరిస్థితి ఉండదు.. అందులోనూ పునీత్ రాజ్ కుమార్ తో ఎన్టీఆర్, రాంచరణ్ లకు మంచి అనుబంధం కూడా ఉంది. ఇవన్నీ పరిశీలిస్తే.. మార్చి 18న RRR Movie Release లేనట్టే అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చినట్టే అయింది.

Read Also :  Space Radio Waves : అంతరిక్షంలో వింత శబ్దాలు.. ప్రతి 18 నిమిషాలకో రేడియో సిగ్నల్.. ఏలియన్స్ చేస్తున్నారా?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel