Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Actress Sruthi Haasan : ‘శృతి హాసన్‌’కి బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన సలార్ మూవీ టీమ్…

Actress Sruthi Haasan : లోక నాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తక్కువ సమయంలోనే బడా హీరోలతో నటించే ఛాన్స్ అందుకుంది శృతి హాసన్. ఆ తర్

By Ramesh Babu

Published on: January 28, 2022 11:50 AM

Updated on: January 28, 2022 12:56 PM

actress-sruthi-haasan-poster-released-from-salaar-movie

---Advertisement---

Actress Sruthi Haasan : లోక నాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తక్కువ సమయంలోనే బడా హీరోలతో నటించే ఛాన్స్ అందుకుంది శృతి హాసన్. ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‏గా కొనసాగిన శృతి… గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. కెరీర్ మంచి పిక్స్‏లో ఉన్న సమయంలోనే ఇంగ్లాండ్ సింగర్ మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడి సినిమాలను వదిలేసింది. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పి తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది శృతి.

ఇటీవల రవితేజ సరసన “క్రాక్” సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ సరసన “వకీల్ సాబ్” సినిమాలో నటించింది. కాగా ప్రస్తుతం ప్రభాస్ సరసన “సలార్”, బాలయ్య 107 సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్‌’. ఇందులో కూడా ఈమె హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్‌ పడింది.

Advertisement

https://twitter.com/prashanth_neel/status/1486919462729125889?s=20&t=ckXyaCvJlbWfWFkOnCxdRQ

నేడు (జనవరి 28) శ్రుతీహాసన్‌ బర్త్‌డే సందర్బంగా సలార్‌ టీమ్‌ ఆమెకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ మేరకు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ… సలార్ మూవీలో ఆమె ఫస్ట్‌ లుక్‌ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ సినిమాలో ఆద్య పాత్రలో శృతి హాసన్‌ నటించనుంది. దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో శృతి కనిపిస్తోంది.

బొగ్గు గనుల మాఫియా నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. అలానే శృతి అభిమానులంతా ఆమెకి బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.

Read Also : RRR Movie Release Date : RRR మూవీ విడుదల మార్చిలో కష్టమే.. ఎందుకో తెలుసా?!

Advertisement

, , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

RELEATED POSTS :