Smartphone Overheating: సాధారణంగా మొబైల్ ఫోన్ ఎక్కువ సమయం పాటు ఉపయోగించడం వల్ల అధికంగా వేడి కలుగుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో చాలా తక్కువ సమయంలోనే ఫోన్ ఎక్కువ హీట్ అవ్వడం మనం చూస్తుంటాము. ఇలా అధికంగా హీట్ అవడం వల్ల కొన్నిసార్లు మొబైల్ ఫోన్ పగులుతుందేమో అనే సందేహం కూడా కలుగుతుంది. ఇలా ఫోన్లు అధికంగా వేడి అయితే ఈ సమస్యనుంచి బయటపడే మార్గాలు కూడా ఉన్నాయి. మరి ఆ మార్గాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
*వేసవి కాలంలో మొబైల్ ఫోన్ అధికంగా వేడి అయినప్పుడు మీరు మీ ఫోన్లో ఏరోప్లేన్ మోడ్ లో పెట్టడం ఎంతో మంచిది. ఈ విధంగా ఏరోప్లేన్ మోడ్ లో పెట్టడం వల్ల స్మార్ట్ ఫోన్ చల్లబడటమే కాకుండా బ్యాటరీని కూడా ఎంతో ఆదా చేస్తుంది.
*గేమింగ్ మొబైల్ ఫోన్లను చల్లబరచడం కోసం ఫోన్ కూలర్ వంటి పరికరాలు రూపొందించబడ్డాయి వీటి సహాయంతో వేడి అయిన మన ఫోన్ ను చల్ల పరచుకోవచ్చు.
*మనం మొబైల్ ఉపయోగించేటప్పుడు అనవసరమైన యాప్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మనం ఉపయోగించని యాప్స్, ఫోటోలు వీడియోలను కూడా తొలగించడం ఎంతో మంచిది. వీటివల్ల ఫోన్ వేడి ఎక్కకుండా ఉండటమే కాకుండా, మన బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది.
*మీ మొబైల్ ఫోన్ తరచూ వేడి అవుతూ ఉంటే మీరు మొబైల్ ఫోన్ కి వేసుకున్న బ్యాక్ పౌచ్ తొలగించడం మంచిది. దీనివల్ల కూడా ఫోన్ అధికంగా హీట్ అవుతుంది. మొబైల్ ఫోన్ అధికంగా వేడి అవుతున్న సమయంలో ఇంటర్నెట్ ఆఫ్ చేయటం వల్ల తొందరగా ఫోన్ చల్ల బడుతుంది. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మొబైల్ ఫోన్ వేడి కాకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.
Read Also :Smart phones: అత్యంత తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్… ధర ఎంతంటే?