...

Whatsapp Hack : ఇలా చేస్తే మీ వాట్సాప్​ ను ఎవరూ హ్యాక్​ చేయలేరు..!

Whatsapp Hack : ప్రముఖ సామాజిక మాధ్యమైన వాట్సాప్​ … స్మార్ట్ ఫోన్​ ఉన్న ప్రతీ ఒక్కరి చేతిలోకి వచ్చేసింది. దాదాపు అన్నీ ఫోన్లు కూడా వాట్సాప్ ను బై డీఫాల్ట్​ గానే ఇస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దీనిని ఉపయోగించే వారి సంఖ్య కోట్లలో ఉంది. అయితే ప్రస్తుతం మీరు ఉపయోగించే వాట్సాప్ అనేది కచ్చితంగా సేఫ్ గానే ఉందా? లేదా అనే దానిపై ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వాట్సాప్ సేఫ్ గా ఉందో లేదో తెలుసు కోవడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.

స్నేహితులు, బంధువులతో ఎప్పుడూ టచ్​ లో ఉండేదుకు వాట్సాప్​ మంచి వేదిక అయ్యింది. ఒక రోజులో ఓ వ్యక్తి ఎన్నిసార్లు వాట్సప్ ను ఓపెన్ చేస్తారు అనేది లెక్క పెట్టలేము. అలాంటి వాట్సాప్ ను భద్రంగా ఉంచుకునేందుకు ఈ చిన్న టిప్ ఫాలో అయితే జాగ్రత్త పడవచ్చు. వాట్సాప్ ను సేఫ్​ గా ఉంచుకునేందుకు ముందుగా ఫాలో అవ్వాల్సింది ఆరు అంకెల పిన్ ను సెట్​ చేసుకోవడం. ఇది చేయడం వల్ల ఎవరూ మీ వాట్సాప్ ను హ్యాక్ చేయలేరు.

మీరు పెట్టుకున్న ఈ వాట్సాప్​ పిన్ ఎంటర్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది. లేక పోతే అవ్వదు. దీనితో పాటు మీ వాట్సాప్ కు లాక్ అనే ఆప్షన్​ ను యాక్టివ్ చేసుకోవాలి. అలా చేయడం ద్వారా కూడా మరెవరూ మీ నంబర్ తో లాగ్ ఇన్​ కాలేరు. ఇది మీకు వాట్సాప్ సెట్టింగ్స్ లో ఉంటుంది. దీనికి ఫేస్ ఐడీతో పాటు ఫింగర్ ప్రింట్ కూడా ఉంటుంది.

వాట్సాప్ తీసుకుని వచ్చిన డిస్ అప్పీయరింగ్ మెసేజస్​ ఆప్షన్ ను ఉపయోగించడం అనేది మంచి పద్దతి. దీనిని యాక్టివ్​ చేసుకున్నా కానీ మీరు పంపిన మెసేజ్​ లు కొద్ది కాలం మాత్రమే ఉంటాయి కాబట్టి మీరు వేరే వాళ్లు చూసే అవకాశాలు చాలా తక్కువ. మీ ఇబ్బందికర మైన నంబర్ నుంచి మెసేజ్లు రావడం, లింక్ రావడం లాంటివి చూస్తే మీరు ఆ నంబర్​ ను వెంటనే బ్లాక్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ గోప్యతను మీరు కాపాడుకోవచ్చు. మీకు క్రియేట్ చేసిన గ్రూప్ ల నుంచి కాకుండా మరే దాని నుంచి అయినా అడ్మిన్ అయ్యి ఉంటే వెంటనే లెప్ట్​ అవ్వండి. ఇలా వీటిని ఫాలో కావడం వల్ల మీరు మీ వాట్సాప్ ను సేఫ్​ గా ఉంచుకోవచ్చు.

Read Also : 5G Services India : మన దేశంలో 5జీ సేవలు… ఎప్పటి నుంచి అంటే?