...

5G Services India : మన దేశంలో 5జీ సేవలు… ఎప్పటి నుంచి అంటే?

5G Services India : మన దేశంలో ఐదో తరం సాంకేతికత త్వరలోనే అందుబాటులోకి రానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో 6 నెలల్లో 5జీ టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు 4జీ కే పరిమితం అయిన మనం ప్రస్తుతం 5జీ ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాము. నేటి వరకు కేవలం కొన్ని అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే పరిమితం అయిన ఈ ఐదో తరం సాంకేతికత మరి కొద్ది రోజుల్లో భారత్​ లోనూ అందుబాటులోకి రానుంది.

భారత్ లో ఐదో తరం టెలికాం సేవలను అందుబాటులోకి తెచ్చేలా ఇప్పటికే కొన్ని టెలికాం సంస్థలు ప్రణాళికలను రచిస్తున్నాయి. అయితే వాటిని మరింత వేగవంతం చేసి ఆగస్టు 15 నాటికి.. అంటే సరిగ్గా ఇండిపెండెన్స్ డే నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రధానమంత్రి కార్యాలయం ట్రాయ్​ కి ఆదేశాలు జారీ చేసింది. దీనిని బట్టి చూస్తే ఆగస్టు 15 నాటికి ఐదో తరం సాంకేతికతను తీసుకువచ్చి.. దానిని దేశ ప్రజలకు అంకితం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఉత్వర్వులు అందుకున్న టెలికాం రెగ్యులేటరీ సంస్థ 5జీ స్పెక్ట్రానికి సంబంధించిన సిఫార్సులను వచ్చే నెలకు పూర్తి చేయాలని భావిస్తుంది. ఇప్పటికే వివిధ బ్యాండ్ విడ్త్​ లకు సంబంధించి స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించిందుకు సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ అనుకున్న దాని కంటే టెలికాం ఆపరేటర్లు ఎక్కువకు బిడ్ వేస్తారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఇది కానీ అందుబాటులోకి వస్తే మొబైల్​ వినియోగంలో 5జీ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేగాకుండా పలు పరిశ్రమలకు ఇది చాలా మంచి లబ్ధిని చేకూర్చుతుంది. వీటితో పాటే హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. ఒక సినిమా డౌన్ లోడ్ క్షణాల్లో పూర్తి అవుతుంది.

Read Also : Singer Parvathi : ఆ ఊరికి బస్సు రావడానికి స్మితా, నేనే కారణం.. ఆ మంత్రుల సాయం మరువలేనిది