...

Sudheer Rashmi Love : సుధీర్.. రష్మి లవ్‌ సింబల్స్ వేయడం లేదు ఎందుకు… అసలేం జరుగుతోంది?

Sudheer Rashmi Love : ఈటీవీలో జబర్దస్త్ ప్రారంభం అయి తొమ్మిది సంవత్సరాలు దాటి పోయింది. ఈ తొమ్మిది సంవత్సరాల్లో జబర్దస్త్ లో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. కానీ గత ఏడెనిమిది సంవత్సరాలుగా సుడిగాలి సుధీర్ మరియు రష్మీ గౌతమ్ ల లవ్ మాత్రం ఏమాత్రం మారలేదు అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది అంటూ షో నిర్వాహకులు చేప్పే ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయేమో అనిపిస్తుంది. వీరిద్దరి జోడీకి మంచి పేరు రావడంతో పాటు అభిమానులు నిజంగానే వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు ఏమో అన్నంతగా నమ్మేశారు.

అదంతా ఆన్ స్క్రీన్ కోసమే అని పలు సందర్భాల్లో సుధీర్ మరియు రష్మి గౌతమ్‌ లు చెప్పినా కూడా అభిమానులు మాత్రం ఇద్దరు నిజంగా ప్రేమించుకుంటే బాగుంటుంది.. ఇద్దరి జంట అద్భుతంగా ఉంటుంది అంటూ ప్రతి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా వచ్చిన టాక్ తో మల్లెమాల వారు మరియు షో నిర్వాహకులు సుధీర్ మరియు రష్మి లపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం.. వారిద్దరికీ లవ్ సింబల్స్ వేయడం వంటివి చేసేవారు. కానీ గత కొన్ని నెలలుగా సుధీర్ రష్మీ ల పై లవ్ సింబల్స్ వేయడం తగ్గించారు.

jabardast-sudigali-sudheer-and-rashmi-goutam-love-come-ends
jabardast-sudigali-sudheer-and-rashmi-goutam-love-come-ends

ఇతర కమెడియన్స్ జంటల్లో లవ్‌ కపుల్స్ ను వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రష్మి పెళ్లి చేసుకుందనే వార్తలు వస్తున్నాయి. మరి కొందరు త్వరలో రష్మీ పెళ్లి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడ కూడదనే ఉద్దేశం తో సుడిగాలి సుదీర్ తో ఆమెకు లవ్ సింబల్స్ వేయడం తగ్గించారు అనే టాక్ వినిపిస్తోంది. సుడిగాలి సుదీర్ కూడా అతి త్వరలోనే పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది లో ఈ ప్రశ్నలకు సమాధానం దక్కుతుందని సుధీర్ అభిమానులు ధీమాతో ఎదురు చూస్తున్నారు.

Read Also : Ante Sundaraniki : నాని బర్త్‌డే హోమం.. అంటే సుందరానికి.. ఎన్ని గండాలో.. వీడియో వైరల్!