Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Vivo Y400 5G : కొత్త వివో Y400 5G వచ్చేసిందోచ్.. AI ఫీచర్లు భలే ఉన్నాయి.. ధర ఎంతో తెలుసా?

Vivo Y400 5G : 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 50MP సోనీ IMX852 బ్యాక్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాతో అండర్ వాటర్ ఫోటోగ్రఫీ సపోర్ట్‌తో వస్తుంది. AI ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, నోట్ అసిస్ట్, స్మార్ట్ డాక్యుమెంట్ క్యాప్చర్ వంటి AI-ఆధారిత టూల్స్ అందిస్తుంది.

By Vinod Kumar

Published on: August 4, 2025 2:29 PM

Updated on: August 4, 2025 2:29 PM

Vivo Y400 5G launched in India

---Advertisement---

Vivo Y400 5G : కొత్త వివో ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో వివో నుంచి Y400 5G ఫోన్ వచ్చేసింది. వివో Y400 ప్రో తర్వాత చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో Y400 5Gని అధికారికంగా లాంచ్ చేసింది. ఈ వివో ఫోన్ 6000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్‌సెట్, IP68, IP69-రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

ఈ వివో ఫోన్ Amazon, Flipkart, Vivo e-store ఇతర ఛానెల్స్ వంటి ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ తడి చేతి ఆపరేషన్, తేమ డిటెక్షన్, నీటి అడుగున ఫోటోగ్రఫీకి సపోర్టు ఇస్తుందని వివో పేర్కొంది. వివో Y400 5G ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో వస్తుంది.

Vivo Y400 5G స్పెసిఫికేషన్లు :

వివో Y400 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల FHD+ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. 1,800 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది. హుడ్ కింద 8GB వరకు ర్యామ్ LPDDR4X, 256GB వరకు UFS 3.1 స్టోరేజీతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 SoC నుంచి పవర్ పొందుతుంది.

Read Also : Hero Glamour Bike : జస్ట్ రూ. 10 వేల డౌన్ పేమెంట్‌తో ఈ కొత్త హీరో బైక్ ఇంటికి తెచ్చుకోండి.. ఫుల్ ట్యాంక్‌తో 880 కి.మీ దూసుకెళ్లగలదు.. ధర ఎంతంటే?

ఈ వివో ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఆండ్రాయిడ్ ఆధారిత FunTouch OS 15పై రన్ అవుతుంది. కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50MP సోనీ IMX852 ప్రైమరీ షూటర్, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

Vivo Y400 5G AI ఫీచర్లు :

ఈ వివో ఫోన్ AI డాక్యుమెంట్ క్యాప్చర్, స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, సర్కిల్ టు సెర్చ్, ఆడియో ట్రాన్స్‌క్రిప్షన్‌ల కోసం AI ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, ఆటో సమ్మరీస్, ట్రాన్సులేషన్ కోసం AI నోట్ అసిస్ట్, లో సిగ్నల్ ఉన్న ప్రాంతాలలో కనెక్టివిటీకి కోసం AI సూపర్‌లింక్ వంటి అనేక AI ఫీచర్లతో వస్తుంది.

భారత్‌లో వివో Y400 5G ధర ఎంతంటే? :

వివో Y400 5G ఫోన్ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 21,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ. 23,999కు పొందవచ్చు. ఈ వివో ఫోన్ ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. ఆగస్టు 7, 2025 నుంచి అమ్మకానికి ఉంటుంది. కస్టమర్లు 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ వివో ఫోన్ TWS 3e ANC ఇయర్‌ఫోన్‌లతో రూ. 1,499కి లభిస్తుంది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!