Hero Glamour Bike : జస్ట్ రూ. 10 వేల డౌన్ పేమెంట్‌తో ఈ కొత్త హీరో బైక్ ఇంటికి తెచ్చుకోండి.. ఫుల్ ట్యాంక్‌తో 880 కి.మీ దూసుకెళ్లగలదు.. ధర ఎంతంటే?

Hero Glamour Bike : తక్కువ బడ్జెట్‌లో కొత్త బైక్ కోసం చూస్తున్నారా? హీరో గ్లామర్ బైక్ కొనేసుకోండి. హీరో ఈ బైక్‌ను కేవలం రూ. 10వేల డౌన్ పేమెంట్‌తో లోన్ కూడా పొందవచ్చు.

Hero Glamour Bike : కొత్త బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, భారత మార్కెట్లో అనేక బ్రాండ్ల బైక్ కంపెనీలు ఉన్నాయి. ఏ బైక్ కొనాలో (Hero Glamour Bike) ఏది కొనకూడదో అర్థం చేసుకోవడం కష్టమే. మీరు కూడా సౌకర్యం, మైలేజ్, తక్కువ నిర్వహణ, తక్కువ బడ్జెట్ ఉన్న బైక్ కోసం చూస్తున్నారా?

హీరో గ్లామర్ మీకు అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ హీరో బైక్‌కు కేవలం రూ. 10,000 డౌన్ పేమెంట్‌తో ఫైనాన్స్ కూడా పొందవచ్చు. ఈ బైక్ మైలేజ్, ధర, ఈఎంఐ ఆప్షన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Hero Glamour Bike : ధర ఎంతంటే? :

దేశ రాజధాని ఢిల్లీలో హీరో గ్లామర్ బేస్ డ్రమ్ వేరియంట్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ. లక్ష రూపాయలు. ఎక్స్-షోరూమ్ ధరతో పాటు ఇందులో RTO ఛార్జీలు, ఇన్సూరెన్స్ మొత్తం ఉన్నాయి. అయితే, బైక్ ఆన్-రోడ్ ధర నగరాలు, వేరియంట్‌లను బట్టి మారుతుంది.

Advertisement

Read Also : Driving License Online : ఇకపై RTO ఆఫీసుకు వెళ్లనక్కర్లేదు.. ఇంట్లోనే ఆన్‌లైన్‌లో మీ డ్రైవింగ్ లైసెన్స్‌ రెన్యువల్ చేయొచ్చు!

డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? :

మీరు ఈ బైక్‌ను రూ. 10,000 డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేస్తే.. మిగిలిన రూ. 90,000కి మీరు బైక్ లోన్ తీసుకోవలసి ఉంటుంది. 9శాతం వడ్డీ రేటుతో 3 ఏళ్ల పాటు లోన్ తీసుకున్నారని అనుకుందాం, అప్పుడు మీ నెలవారీ ఈఎంఐ దాదాపు రూ. 3,000 అవుతుంది.

Hero Glamour bike
Hero Glamour bike

ఫీచర్లు, మైలేజ్ :

హీరో గ్లామర్ 125 ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో LED హెడ్‌ల్యాంప్‌లు, హజార్డ్ లైట్లు ఉన్నాయి. ఇంజిన్ కిల్ స్విచ్‌ను బైక్‌ను స్టార్ట్ చేయడం లేదా ఆపేందుకు ఉపయోగించవచ్చు. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి అడ్వాన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. హీరో గ్లామర్ 124.7cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 11.4bhp పవర్, 10.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Advertisement

ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా ఉంది. ఈ ఇంజిన్ OBD2B కంప్లైంట్, ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో వస్తుంది. మెరుగైన మైలేజ్, సున్నితమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. కంపెనీ ప్రకారం.. ARAI-సర్టిఫైడ్ మైలేజ్ లీటర్‌కు 65kmpl వేగం, ఈ బైక్ ఫుల్ ట్యాంక్‌తో 880కి.మీ వరకు దూసుకెళ్లగలదు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

Join our WhatsApp Channel