...

Twitter Warning Label : ట్విట్టర్‌లోకి వచ్చిన వార్నింగ్ లేబుల్ ఫీచర్… ఇకపై అలాంటి కంటెంట్ కు చెక్!

Twitter Warning Label : ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ప్రతి ఒక్కరి చేతిలోనూ ప్రపంచం ఉంది అని చెప్పవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా వెంటనే సెల్ ఫోన్ ద్వారా మన అందరికీ తెలిసిపోతుంది. అయితే ఇలా ఎంతో అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. క్రమంలోనే అశ్లీలత, హింస, సున్నితత్వంతో కూడి కంటెంట్‌ (Contet) కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఈ విధమైనటువంటి అభ్యంతరకర వీడియోలకు చెక్ పెట్టడం కోసం ఫేస్ బుక్ ను ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

warning-label-feature-coming-into-twitter-no-more-such-content
warning-label-feature-coming-into-twitter-no-more-such-content

ఈ ఫీచర్ ద్వారా పోస్ట్ చేసే వీడియోకి ఆ వీడియో స్వభావాన్ని తెలపవచ్చు. అయితే ఈ అద్భుతమైన ఫీచర్లు ఇప్పటివరకు కేవలం ఫేస్ బుక్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ట్విట్టర్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇకపై ట్విటర్ ద్వారా ఎవరైనా ఒక వీడియో లేదా ఫోటో షేర్ చేసినప్పుడు తప్పనిసరిగా పైన ఉండే మూడు చుక్కలని క్లిక్ చేస్తే మనకు ఎడిట్ ఆప్షన్ వస్తుంది.దానిపై క్లిక్‌ చేస్తే చివర్లో ఫ్లాగ్‌ ఐకాన్‌ కనిపిస్తుంది. అందులో న్యూడిటీ (అశ్లీలత), వయలెన్స్‌ (హింస), సెన్సిటివ్‌ అనే మూడు కేటగిరీలు ఉంటాయి.

ఈ క్రమంలోనే యూసర్ వారికి సంబంధించిన వీడియో లేదా ఫోటో డిలీట్ చేయాలంటే అది ఏ కేటగిరికి కిందకు వస్తుందో తెలుసుకొని పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే ఆ వీడియో పోస్ట్ చేసే సమయంలోనే అది ఎలాంటి వీడియో అనేది ముందుగానే సూచించి యూజర్ కు వార్నింగ్ లేబుల్ ద్వారా సమాచారం అందుతుంది. అయితే ఈ ఫీచర్ కేవలం ఫోటో వీడియో లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ అద్భుతమైన ఫీచర్ ఉండటంవల్ల కొన్నిరకాల అశ్లీల వీడియోలు ఫోటోలకు అడ్డుకట్ట వేయవచ్చు.

Read Also : Two Naughty Guys : వీళ్లు మగాళ్లు రా బుజ్జి.. ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. చివర్లో ఏమైందంటే?