...

2G Network : భారత్‌లో ఇంకా 2G నెట్‌వర్క్.. కారణం ఏంటంటే..?

2G Network : టెలికాం మార్కెట్‌లో చాలా నెట్ వర్క్ ఉన్నాయి. మన దేశంలో దాదాపు ఒక మిలియన్ కంటె ఎక్కువ మంది కస్టమర్స్‌ను సొంతం చేసుకున్నాయి. చాలా మంది కమ్యూనికేషన్ ప్రయోజనాల కోసం ఇంకా 2జీ నెట్ వర్క్‌ను ఉపయోగిస్తున్నారు. బ్రౌజింగ్ కోసం కాకుండా కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ ల కోసం మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. వృద్ధులు, చదువుకోని వారి ఎక్కువగా వీటిని యూజ్ చేస్తున్నారు. జియో తప్ప అన్ని టెలికాం ఆపరేటర్స్‌కు కాస్తో, కూస్తో 2జీ కస్టమర్స్ ఉన్నారు.

అందుకే ఆయా నెట్‌వర్క్స్ 2జీ సేవలను ఇంకా అందిస్తున్నాయి. దీనిని క్లోజ్ చేయడం వల్ల 3జీ సేవలను ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల అందరూ దాదాపుగా బీఎస్ఎన్ఎల్ వైపే మొగ్గుచూపే చాన్స్ ఉంది. దీని వల్ల ఐడియా, ఎయిర్ టెల్ వంటి నెట్ వర్క్స్ నష్టపోతాయి. వొడాఫోన్ ఐడియాకే ఇలాంటి కస్టమర్స్ ఎక్కువగా ఉండటంతో 2జీ సేవలను ఇంకా కొనసాగిస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా 2జీ యూజర్స్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తారు. కేవలం యూత్ మాత్రమే 4జీ సేవలకు అలవాటు పడ్డారు. 4జీ సపోర్ట్ లేని వారు ప్రస్తుతం చాలా మంది ఉన్నారు. ఉన్నట్టుండి 2జీని మూసేస్తే వారిని నెట్‌వర్క్ సంస్థలు వదులుకోక తప్పదు. 2జీ మూసివేస్తే వారు ఇతర నెట్ వర్క్ లను ఆశ్రయించే చాన్స్ ఉంది. దీని వల్ల ప్రస్తుత నెట్‌వర్క్ సంస్థలు నష్టపోక తప్పదు. ఇక 5జీని సైతం లాంచ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 4జీ ఇప్పటికే 50 ఎంబీపీఎస్ కంటే ఎక్కువ స్పీడ్ ను అందిస్తుంటే.. 5జీ నెట్ వర్క్ కస్టమర్లకు యూజ్ చేయలేరు. ఎందుకంటే ఇది చాలా కాస్ట్. అనవసరమైనది కూడా.

Read Also : Jio New Feature : ఇక రీఛార్జ్‌ల బాధ తప్పినట్టే.. జియో యాప్‌లో నయా ఫీచర్..!