LPG Cylinder Price: సామాన్యులకు భారంగా మారిన ఎల్పీజీ సిలిండర్… మరోసారి నింగికేగిరిన సిలిండర్ ధర!

LPG Cylinder Price: అమ్మో ఒకటో తారీక్ … అని భయపడేలా సామాన్యుల జీవితాలు మారిపోయాయి. 1వ తేదీ వచ్చిందంటే చాలు నిత్యావసర వస్తువుల పై అధిక ధరలను పెంచుతూ సామాన్యులకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు అయిన పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం ధరలు పెరిగిపోయి సామాన్యులకు భారంగా మారింది. ఇదిలా ఉండగా గత నెల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పై భారీ స్థాయిలో ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో కూడా గ్యాస్ సిలిండర్లపై భారీ మోత విధించి సామాన్యులకు భారంగా మార్చింది.

pjimage 97ప్రతి నెల ఒకటవ తేదీన ఆయిల్ కంపెనీ ఎల్పీజీ ధరలు సవరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే గత నెల ఒక్కో సిలిండర్ పై 250 రూపాయల ధర పెంచిన ఆయిల్ కంపెనీ ఈ నెల కూడా ఒక్కో సిలిండర్ పై ఏకంగా 104 రూపాయలు ధరలను పెంచింది. ఈ క్రమంలోనే మే 1వ తేదీ నుంచి 19 కేజీల కమర్షియల్ సిలిండర్ గ్యాస్ కొనుగోలు చేయాలంటే రూ.2355.5 చెల్లించాల్సి ఉంది. ఇక హైదరాబాదులో 19 కేజీల సిలిండర్ ధర 2563.5 రూపాయలు కాగా, విశాఖపట్నంలో గత నెల రెండు వేల మూడు వందల ఇరవై ఒక్క రూపాయలు ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం 2413 రూపాయలకు చేరింది.

విజయవాడలో గతంలో రెండు వేల నాలుగు వందలు 20 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం 2501 రూపాయలకు చేరింది. ఈ విధంగా ప్రతి నెల ఎల్పిజి గ్యాస్ సిలిండర్లపై ఇలా ధరలు పెంచడంతో సామాన్యులకు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాలన్న భారంగా మారింది పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట నూనె ధరలతో పాటు ఎల్పీజీ ధరలు కూడా పెరగడంతో ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.