Lenovo Mobile : 22GB RAMతో లెనోవో న్యూ మొబైల్… ఇదే అత్యంత పవర్ ఫుల్ ఏమో!

Lenovo Mobile : ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం లెనోవో త్వరలోనే భారీ ర్యామ్‌ స్టోరేజ్‌తో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లెనోవో Legion Y90 Gaming గేమింగ్ స్మార్ట్‌ ఫోన్‌ను రిలీజ్‌ చేయనుంది. ఇప్పటివరకు వచ్చినా స్మార్ట్‌ఫోన్స్‌లో లెనోవో Legion Y90 ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్‌ గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచే అవకాశం లేకపోలేదని స్మార్ట్‌ఫోన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

పవర్‌ఫుల్‌ RAM..ఏకంగా 22GB..!

లెనోవో Legion Y90 స్మార్ట్‌ఫోన్‌ క్వాలకం స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 చిప్‌సెట్‌తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్‌ విబోలో వైరల్‌గా మారాయి. వచ్చే నెల ఫిబ్రవరిలో లెనోవో Legion Y90 స్మార్ట్‌ఫోన్‌ చైనాలో లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ 22జీబీ ర్యామ్ తో రానుంది. ఈ ర్యామ్ 18 జీబీ ఫిజికల్ ర్యామ్‌తో పాటు 4 జీబీ వర్చువల్ ర్యామ్‌ను కలిగి ఉండనుంది. 512 జీబీ +128 జీబీ రెండు విభిన్న ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో మొత్తంగా 640 జీబీ తో లెనోవో లీజియన్ Y90 రానుంది.

Advertisement
lenovo-company-launching-new-mobile-with-22-gb-ram
lenovo-company-launching-new-mobile-with-22-gb-ram

Lenovo Legion Y90 Specifications స్పెసిఫికేషన్‌ (అంచనా)

  • 6.92 – అంగుళాల E4 శాంసంగ్‌ AMOLED డిస్‌ప్లే
  • క్వాలకం స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 చిప్‌సెట్‌
  • 22GB ర్యామ్‌ + 640 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
  • 64MP + 16ఎంపీ రియర్‌ కెమెరా
  • 44MP సెల్ఫీ కెమెరా
  • ఫ్రాస్ట్ బ్లేడ్ 3.0 డ్యూయల్‌ ఫ్యాన్స్‌ ఫర్‌ కూలింగ్‌
  • 68W ఫాస్ట్ ఛార్జింగ్‌
  • 5,600mAh బ్యాటరీ

దీని ధర ను ఇంకా నిర్ణయించలేదు. మరి ఈ ఫోన్ ని ఎవరైనా కోనాలి అనుకుంటే అవకాశాన్ని మిస్ చేసుకోకండి…

Read Also :  Cyber Crime : కంపెనీ మెయిల్ హ్యాక్ చేసి రూ. 46 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్ళు… ఏం జరిగిందంటే !

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel