Smartphone: ప్రస్తుతకాలంలో స్మార్ట్ ఫోన్ చేతిలో కనపడని వారంటూ ఎవరూ ఉండరు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు స్మార్ట్ ఫోన్ లను ఉపయోగిస్తూ ఉన్నారు. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో పనులు వేగవంతం అయ్యాయి. కరెంటు బిల్లు నుంచి మొదలుకుని బ్యాంకింగ్ వరకు ప్రతి ఒక్కటి మనం స్మార్ట్ ఫోన్ ద్వారా చెల్లించవచ్చు. ఇలా మన జీవితంలో మనకు తెలియకుండానే స్మార్ట్ ఫోన్ కీలక పాత్ర వహిస్తోంది. ఇలా ప్రతి రోజు మనకు ఎంతో ఉపయోగకరమైన ఈ స్మార్ట్ ఫోన్ ఉన్నఫలంగా స్ట్రక్ అవ్వడం, లేదా స్లో కావడం జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా ఫోన్ ఉన్నఫలంగా స్ట్రక్ కాకుండా ఎంతో వేగవంతంగా పని చేయాలంటే కొన్ని టిప్స్ పాటిస్తే చాలు మన ఫోన్ ఎంతో వేగవంతంగా పనిచేస్తుంది.
మన ఫోన్ వేగంగా పని చేయాలంటే ముందుగా మన సెల్ ఫోన్ లో ఉన్నటువంటి వేస్ట్ ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయాలి.అదేవిధంగా చాలామంది ఎన్నో రకాల గేమ్స్ డౌన్లోడ్ చేసి ఉంటారు మనకు అవసరం లేనీ గేమ్స్ అన్నింటిని అలాగే ఇతర యాప్స్ కూడా డిలీట్ చేయాలి. ఇక ఎప్పటికప్పుడు అప్డేట్ యాప్స్ ఉపయోగిస్తూ ఉండాలి.
ప్లేస్టోర్ లో మనకు ఎన్నో రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి.అయితే మనం ఏవి పడితే అవి డౌన్లోడ్ చేసుకోకుండా మనకు ఎంతో సురక్షితమైన వాటిని మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి.ఫోన్‌లో వచ్చే సెక్యూరిటీ అప్‌డేట్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ మన ఫోన్ సురక్షితమైన వెర్షన్ లో పని చేయడానికి దోహదపడుతుంది. అదేవిధంగా మీ డేటా ఎవరికీ బదిలీ చేయకూడదు అనుకుంటే పలు యాప్స్ డౌన్లోడ్ చేసే టప్పుడు మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సిస్ చేయమని అడుగుతారు. ఇలా వ్యక్తిగత సమాచారాన్ని అడిగే యాప్స్ డౌన్లోడ్ చేయకపోవడమే మంచిది. ఈ విషయాలు కనుక దృష్టిలో ఉంచుకుంటే మన ఫోన్ ఎక్కువ కాలం పాటు సేఫ్ గా ఉంటుంది.