Viral Video: స్టూడెంట్స్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసిన టీచర్.. వైరల్ అవుతున్న వీడియో..!

Updated on: July 25, 2025

Viral Video : సాధారణంగా చాలా మంది పిల్లలకు ఎక్కువగా బోర్ కొట్టే ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది స్కూల్ మాత్రమే. ప్రతిరోజూ స్కూల్ కి వెళ్ళి అక్కడ ఉదయం నుండి సాయంత్రం వరకూ స్కూల్ లో టీచర్లు నాన్ స్టాప్ గా పాఠాలు చెబితే ఏ పిల్లలకైన చాలా చిరాకు గా అనిపిస్తుంది. అలా కాకుండా స్కూల్ లో అపుడప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ పేరుతో పిల్లలని ఆటలు ఆడించటం వంటివి చేస్తుంటే పిల్లలు కూడా స్కూల్ కి వెళ్ళటానికి ఆసక్తి చూపుతారు. ఇక పాఠాలు చెప్పే టీచర్లు సైతం ఎప్పుడూ పాఠాలు చెబితే అలాంటి టీచర్లను పిల్లలు కూడా ఇష్టపడరు.

కానీ కొంతమంది టీచర్లు పిల్లలకి పాఠాలు చెబుతు.. వాటితో పాటు ఆటలు ఆడించటం, డాన్స్ నేర్పించటం వంటివి చేస్తే పిల్లలు కూడా ఆ టీచర్లను బాగా ఇష్టపడతారు. ఇటీవల ఒక స్కూల్ కి చెందిన టీచర్ పిల్లలకి పుస్తకాలలో ఉన్న పాఠాలు నేర్పించటం మాత్రమే కాకుండా పిల్లలకి డాన్స్ పాఠాలు నేర్పిస్తూ.. వారితో కలిసి క్లాస్ రూమ్ లో డాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ డాన్స్ కి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని ఢిల్లీ ప్ర‌భుత్వ పాఠ‌శాల టీచ‌ర్ మ‌ను గులాటీ త‌న ట్విట‌ర్ అకౌంట్‌లో షేర్ చేశారు.

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఈ వీడియోలో మ‌ను గులాటీఅనే టీచర్ త‌న విద్యార్థుల‌తో క‌లిసి క్లాస్ రూం లో బాలీవుడ్ సినిమా ‘కిస్మ‌త్‌’లోని ఎవర్‌గ్రీన్ సాంగ్‌ ‘కజ్రా మొహబ్బత్ వాలా’ అనే పాటకి స్టూడెంట్స్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈ వీడియోలో ముందు విద్యార్థులు వ‌రుస‌లో నిల్చుని ఒక్కొక్క‌రు వ‌చ్చి స్టెప్పులేసి వెళ్తారు. చివ‌ర్లో టీచ‌ర్ వ‌చ్చి ఎంతో అద్భుతంగా డ్యాన్స్ చేసింది. చివరికి విద్యార్థులు అందరూ టీచ‌ర్‌తో కలిసి పాట‌కు అనుగుణంగా స్టెప్పులేశారు. ఈ డాన్స్ వీడియో ని గులాటీ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేస్తూ.. త‌మ స‌మ్మ‌ర్ క్యాంపు చివ‌రి రోజు చేసిన అసంపూర్ణ నృత్య‌మ‌ని, ఆనందం, క‌ల‌యిక తోడైతే అంద‌మైన స్టెప్పులు పుడ‌తాయ‌ని గులాటీ ఈ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోకి 5.5ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. ఈ వీడియోలో విద్యార్థులతో కలిసి డాన్స్ చేసిన టీచర్ పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ‘సమాజంలో మీలాంటి ఉపాధ్యాయులు ఉండటం చాలా అవసరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel