Viral Video: పెళ్లిలో వరుడు పై చేయి చేసుకున్న వధువు.. తెల్లమొహం వేసుకున్న వరుడు..వీడియో వైరల్!

Updated on: April 19, 2022

Viral Video: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎలాంటి వీడియోలైనా, వార్తలు అయిన క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలు పెద్ద ఎత్తున నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి పెళ్లికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా పెళ్లికూతురు ఏకంగా వరుడి పై చేయి చేసుకోవడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లా చమారీ గ్రామానికి చెందిన రీనా అనే యువతికి, హమీర్‌పూర్‌కి చెందిన రవికాంత్ అహిర్వార్ అనే యువకుడికి ఇటీవల పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకలలో భాగంగా అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక ఈ వేడుకలలో భాగంగా వరుడు వధువు మెడలో పూలమాల వేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరుడు బంధువులు, అతిధుల సమక్షంలో వధువు మెడలో పూలమాల వేయగానే వధువు ఒక్కసారిగా వరుడి చెంపపై చేయి చేసుకుంది.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు అతని చంపను చెల్లు మనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వధువు ఇలా వరుడు పైచేయి చేసుకోవడానికి గల కారణం పెళ్ళి సమయంలో కూడా వరుడు ఫుల్లుగా మద్యం సేవించి ఉండటం వల్లే వధువు చేయి చేసుకుందని పలువురు భావిస్తున్నారు. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం వధువుకు ఇష్టం లేని పెళ్లి చేయటం వల్లే ఇలా వరుడి పై చేయి చేసుకొని ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel