Android Apps : ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక.. మీ ఫోన్లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..!

Android Apps : మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? అయితే, మీరు ఈ విషయం తప్పక తెలుసుకోండి. సైబర్‌ సెక్యూరిటీ సర్వీస్‌ ప్రొవైడర్‌ మాల్‌వేర్‌బైట్స్‌ వైరస్‌ సోకిన గూగుల్‌ ప్లే స్టోర్‌ యాప్‌ల లిస్టును రిలీజ్ చేసింది. డెవలపర్ మొబైల్ యాప్‌ల గ్రూప్ నుంచి డేంజరస్ యాప్‌లను Google Playలో లిస్టు చేసింది. Android/Trojan.HiddenAds.BTGTHB బారిన పడ్డాయని కంపెనీ తెలిపింది. ఈ నాలుగు యాప్‌లు మాల్వేర్ యాక్టివిటీని కొంత సమయం వరకు హైడ్ చేసినట్టు తెలిపింది. చివరికి Chromeలో ఫిషింగ్ సైట్‌లను రీడైరెక్ట్ చేస్తాయని హెచ్చరించింది.

Android users, remove these four apps from your smartphone right now
Android users, remove these four apps from your smartphone right now

యాప్ పేర్లు ఏమిటి? :
బ్లాగ్ పోస్ట్ ట్రోజన్ మాల్వేర్‌తో బగ్ తో కూడిన 4 యాప్‌ల లిస్టు ఇదే :
– బ్లూటూత్ ఆటో కనెక్ట్
– బ్లూటూత్ యాప్ పంపినవారు
– డ్రైవర్: బ్లూటూత్, USB, Wi-Fi
-మొబైల్ బదిలీ: స్మార్ట్ స్విచ్

బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. ఈ యాప్‌లు కలిపి మిలియన్ కన్నా ఎక్కువ డౌన్‌లోడ్‌ అయ్యాయి. ఈ యాప్‌ల పాత వెర్షన్‌లు ఇప్పటికే Android/Trojan.HiddenAds అనేక వేరియంట్‌లుగా ఉన్నాయి. డెవలపర్ – మొబైల్ యాప్‌ల గ్రూపు.. ఇప్పటికీ లేటెస్ట్ HiddenAds మాల్వేర్‌ ఉందని Google Play స్టోర్‌లో లిస్టు అయింది.

Advertisement

Android Apps : ఈ యాప్‌లు ఎలా పని చేస్తాయి? :

MalwareBytes బ్లాగ్ పోస్ట్‌లో.. ఈ యాప్‌లు వెనక మాల్‌వేర్ హైడ్ అయి ఉన్నాయని వివరిస్తుంది. డేంజరస్ యాప్స్ మాల్వేర్ డెవలపర్‌ల ద్వారా బయట పెట్టింది. ఈ యాప్‌లు క్రోమ్ బ్రౌజర్‌లో ఫిషింగ్ సైట్‌లను ఓపెన్ చేస్తాయని బ్లాగ్ పోస్ట్ పేర్కొంది. అయితే, ఈ ఫిషింగ్ వెబ్‌సైట్‌ల కంటెంట్ మారుతూ ఉంటుంది. కొన్ని హాని చేయనివి ఉంటే.. ఒక్కో క్లిక్‌కి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరికొన్ని డేంజరస్ సైట్‌లలో యూజర్లను మోసగించడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు, ఒక సైట్ అడల్ట్ కంటెంట్‌ను కలిగి ఉంటుంది. అది ఫిషింగ్ పేజీలకు రీడైరెక్ట్ అవుతుంది.

Android users, remove these four apps from your smartphone right now
Android users, remove these four apps from your smartphone right now

అందుకే యూజర్లు వెంటనే తమ బ్రౌజర్ అప్ డేట్ చేయవలసి ఉంటుంది. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. మొబైల్ డివైజ్ లాక్ అయినప్పుడు కూడా Chrome ట్యాబ్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉంటాయి. యూజర్ వారి డివైజ్ అన్‌లాక్ చేసినప్పుడు.. Chrome లేటెస్ట్ సైట్‌తో ఓపెన్ అవుతుంది. ఈ యాప్‌లలో దేనినైనా మీరు ఇన్‌స్టాల్ చేసి ఉంటే వెంటనే స్మార్ట్‌ఫోన్‌ల నుంచి డిలీట్ చేయడం మంచిది. యాప్ అనుమతులు, డెవలపర్‌ల డేటాను డౌన్‌లోడ్ చేయడానికి ముందు ఎల్లప్పుడూ చెక్ చేయాలి.

Read Also : Pavithra Lokesh : ఆ స్టార్ హీరో నన్ను వాడుకుని వ‌దిలేశాడు.. బాంబు పేల్చిన ప‌విత్రా లోకేష్‌..?!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel