Pawan kalyan: వచ్చే ఏడాది తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి నేతలు, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు తనను కలిసిన తెలంగాణ నేతలతో మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో నేతలు కార్యకర్తలకు రాజకీయ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామని తెలంపారు. తెలంగాణలో పార్టీ నేతలు వివిధ విభాగాల అధ్యక్షులు, మహిళలు మొత్తం కలిసి 32 మంది పవన్ కల్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. వారికి తెలంగాణలో ఉన్న రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజాపక్షం వహిస్తూ.. ప్రజల సమస్యలను తెలుసుకోవాలని పవన్ కల్యాణ్ తెలిపారు. క్షేత్రస్థాయిలో చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి నేతలు శ్రేణులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. అలాగే తెలంగాణలో నిర్వహించబోయే జనసేన పార్టీ డివిజన్ స్థాయి సమావేశాలపై చర్చించారు. అయితే గతంలో తెలంగాణలో కూడా జనసేన పార్టీకి పొత్తు ఉందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆ పార్టీక మద్దతు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నిక్లోల పోటీ చేయడానికి ముందు సిద్ధం అయ్యారు. అయితే బీజేపీ నేతల నుంచి వచ్చిన వినతితో నామినేషన్లు వేసి కూడా ఉపసంహరించుకున్నారు. దీని వల్లే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించింది.