Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకవైపు రాజకీయాలలోను, మరోవైపు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు. ఇలా వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉంటూనే తండ్రిగా తన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ ఓ మంచి తండ్రిగా గుర్తింపు పొందారు. పవన్ కళ్యాణ్ హీరోయిన్ రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరికి అకీరా, ఆద్య ఇద్దరు సంతానం కలరు. వివాహం తర్వాత కొన్ని సంవత్సరాలకు విడాకులు తీసుకున్న రేణుదేశాయ్ తన వద్ద తన పిల్లలని పెట్టుకున్నారు.
ఈ విధంగా పిల్లలు రేణుదేశాయ్ దగ్గర ఉన్నప్పటికీ తరచూ పవన్ కళ్యాణ్ వారిని కలిసి వారికి కావాల్సిన సౌకర్యాలు అన్నింటిని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మెగా కుటుంబానికి సంబంధించిన ఏ కార్యక్రమానికైనా అకీరా హాజరవుతూ సందడి చేసేవారు.ఈ విధంగా విడాకులు తీసుకున్న తర్వాత అఖీరా పవన్ కళ్యాణ్ ఆధ్యా కలిసి దిగిన ఫోటోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా రేణుదేశాయ్ ని కలిసి తనతో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫోటో చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అకీరా నందన్ ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. అయితే అతని గ్రాడ్యుయేషన్ పూర్తి కావడంతో ఈ కార్యక్రమంలో తండ్రిగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలను నిర్వహించారు. ఇలా తండ్రి స్థానంలో పవన్ కళ్యాణ్ తల్లి స్థానంలో రేణుదేశాయ్ పాల్గొని సందడి చేశారు.ఈ క్రమంలోని వీరందరూ కలిసి దిగిన ఫోటోని రేణుదేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నా కొడుకు అప్పుడే పెద్దోడయ్యాడు.. ఇకపై తను తన సొంత కాళ్లపై నిలబడాలని అంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇలా నలుగురిని ఒకే ఫ్రేమ్ లో చూసిన పవన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Pawan Kalyan : చావడానికైనా సిద్ధమన్న పవన్ కళ్యాన్… ఎందుకో తెలుసా!
Tufan9 Telugu News And Updates Breaking News All over World