Ambanti Rambabu: ఉగాది నుంచి ఏపీలో కొత్త జిల్లాల పరిపాలన… చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేసిన అంబటి!

Ambanti Rambabu: ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.ఈ క్రమంలోనే ఎన్నికల హామీలలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు వైపు శరవేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొత్త జిల్లాలను ప్రకటించిన జగన్ ప్రభుత్వం ఉగాది నుంచి కొత్త జిల్లాలలో పరిపాలన ప్రారంభమవుతుందని తెలియజేశారు. ఈ క్రమంలోనే శనివారం వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రతిపక్షనేత చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేశారు.

గత 40 సంవత్సరాల చంద్రబాబు పరిపాలన పై ముప్పై నాలుగు నెలల జగన్ పరిపాలన పై చర్చ జరగాలని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా చంద్రబాబు వ్యవస్థను నాశనం చేసే విధానాలపై చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.ఈనెల 29వ తేదీ నుంచి గతంలో చంద్రబాబు చేసిన అరాచకాల గురించి తప్పనిసరిగా వివరిస్తామని అంబటి వెల్లడించారు.

Advertisement

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరగడం కోసం వికేంద్రీకరణ జరుగుతుంటే కేవలం తన సొంత లాభం కోసం చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధి జరగాలని ఆరాటపడుతున్నారు.చంద్రబాబు హయాంలో ఉన్నప్పుడు తన ఎన్నికల మేనిఫెస్టోను మాయం చేసిన ఘనత ఒక్క చంద్రబాబుకే మాత్రమే దక్కుతుందని ఘాటు విమర్శలు చేశారు. కానీ జగన్ ప్రభుత్వంలో ఎన్నికలలో ఇచ్చిన మేనిఫెస్టోను ఇంటింటికి పంపించామని ఈ సందర్భంగా అంబటి గుర్తు చేశారు. 29వ తేదీ నుంచి జరగబోయే చర్చలలో చంద్రబాబు మద్యం విషయం కూడా చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement