...

Nara Lokesh: ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పై సంచలన ట్వీట్ చేసిన నారా లోకేష్.. ట్వీట్ వైరల్!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల విస్తరణ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రధానమంత్రితో భేటీ కానున్న నేపథ్యంలో ఢిల్లీ పయనమయ్యారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన అనంతరం కేంద్రం నుంచి జిల్లాలకు రావాల్సిన బడ్జెట్ కోసం జగన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నారనే విషయం తెలుస్తుంది. కొత్త జిల్లాలకు రావాల్సిన నిధులతో పాటు రాష్ట్రంలోని పలు కీలక అంశాలను కూడా ప్రధాని దగ్గర ప్రస్తావించనున్నారు. ఈ క్రమంలోనే జగన్ ఢిల్లీ పర్యటన పై టిడిపి జాతీయ కార్యదర్శి, కీలక నేత లోకేష్ సంచలన ట్వీట్ చేశారు.

Advertisement

ఈ సందర్భంగా లోకేష్ స్పందిస్తూ పేలని జ “గన్” హస్తిన పయనం ఎందుకో అంటూ ట్వీట్ చేశారు… బాబాయ్ హత్య కేసులో బయటపడ్డ అవినాష్ రెడ్డిని తప్పించడానికి ఢిల్లీ వెళ్తున్నారా లేకపోతే తను కొట్టేస్తే
కాగ్ పట్టేసిన రూ. 48 వేల కోట్ల వ్యవహారాన్ని కామప్ చేయాలని వెళ్తున్నారా అంటూ నారా లోకేష్ జగన్ పై ధ్వజమెత్తారు.

Advertisement

ఇప్పటికే తనపై ఉన్న సీబీఐ ఈడీ దర్యాప్తు నిలిపివేయాలని, లక్ష కోట్ల ఆస్తులలో చెల్లికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా మహిళలకు ఆస్తి హక్కును రద్దు చేయడం కోసం ఢిల్లీ వెళ్తున్నారా అంటూ లోకేష్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం జగన్ ఢిల్లీ పర్యటన పై లోకేష్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే నేడు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రితో భేటీ అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement