CM KCR : సెంట్రల్‌లోని మోడీ సర్కార్ పై విరుచుకుపడుతున్న ముఖ్యమంత్రుల జాబితా క్రమంగా పెరుగుతోంది. మొన్నటివరకు తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ రేంజ్ మోడీ విధానాలను తప్పు బడుతూ వచ్చారు. ఇక హుజురాబాద్ ఫలితం తారుమారు కావడంతో సీఎం కేసీఆర్ కూడా కేంద్రంతో మెతక వైఖరిని మార్చుకుని యుద్ధం చేస్తా అంటూ మీడియా ముఖంగా ప్రకటన చేశారు.
రాష్ట్రంలో క్రమంగా టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీలో ఒక్కసీటు నుంచి బీజేపీ మూడు స్థానాలకు ఎగబాకింది. ఇది ఇలానే కొనసాగితే పార్టీలోని అసంతృప్తులు కూడా బీజేపీతో చేయి కలిపి రాష్ట్రంలో కారు పార్టీని పంక్చర్ చేసేస్తారని భయం పట్టుకుందని తెలుస్తోంది.
ఇకపోతే మోడీ గ్రాఫ్ పడిపోతుందని అన్న ప్రతీసారి రీ బౌన్స్ అవుతున్నారు. ఈ మధ్యనే ఓ ఇంటర్నేషల్ సర్వే రిపోర్టు ప్రకారం మోడీ గ్రేట్ అని కుండబద్దలు కొట్టింది. అయితే, మొన్న జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి ఉత్తరాదిన కొన్ని సీట్లు తగ్గాయి. ఫర్‌ఫెక్ట్‌గా మోడీ గ్రాఫ్ తగ్గిందా పెరిగిందా అనేది తెలుసుకోవాలంటే.. 2022లో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత అంచనా వేయొచ్చు.
ఉత్తరాదిన మోడీ గ్రాఫ్ ఎలా ఉన్నా సౌతిండియాలో బీజేపీకి కలిసి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మొన్నటివరకు తమిళనాట అన్నాడీఎంకేతో పొత్తు ఉన్నా.. స్టాలిన్ రాకతో అంతా తారుమారైంది. ఈయన కమ్యూనిస్టు సిద్ధాంతాలు నమ్మే వ్యక్తి. మరోవైపు కేరళ సీఎం పినరయి విజయన్ కూడా అంతే.. ఇక కేసీఆర్ మొన్నటివరకు బీజేపీతో దోస్తానా చేసి ఇప్పుడు యుద్ధం చేస్తానంటున్నారు.
ఏపీలో వైసీపీ విషయానికొస్తే ప్రస్తుతానికి కేంద్రంతో చాటుగా దోస్తీ చేస్తున్నా మళ్లీ ఎన్నికల వరకు తన స్టాండ్ మార్చుకునే అవకాశం లేకపోలేదు. ఇక కర్ణాటక బీజేపీదే అయినా అక్కడ కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటోంది. ఇలా అందరూ ఎవరి స్వార్థం వారు చూసుకుంటునే మోడీతో దోస్తీ లేదా వార్ అని ప్రకటిస్తున్నారు. కానీ ఎన్నికల టైం వరకు ఎవరి ఇంటిని వారు చక్కదిద్దుకోవడంపైనే ప్రధాన దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది.
Read Also : CM KCR : ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్.. ‘ఈటల’ను దెబ్బతీసేందుకు మరో వ్యూహం!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world