Chandrababu : తెలుగుదేశం పార్టీ భవిష్యత్ గురించి అభిమానులు, కార్యకర్తలు తెగ ఆందోళన చెందుతున్న తరుణంలో అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తెలుగు తమ్ముళ్లలో మళ్లీ జీవం పోసినట్టు అయ్యింది. దీంతో టీడీపీ పార్టీలో యాక్టివ్ నెస్ పెరిగిందని, కిందిస్థాయి కేడర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తు్న్నారని తెలుస్తోంది. మొన్నటివరకు అన్ని ఎన్నికల్లో ఓడిపోతూ రావడంతో టీడీపీ పార్టీ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో కేడర్ మొత్తం నిద్రావస్థలోకి వెళ్లిపోయింది. అయితే, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు పార్టీలో ఈ మార్పునకు కారణంగా తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో ఏపీ ప్రజలకు దిక్సూచిలా మారతాడని ప్రజలంతా టీడీపీ పార్టీని అక్కున చేర్చకున్నారు. భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి మరోసారి బాబును ముఖ్యమంత్రిని చేశారు. అయితే, అధికారంలోకి వచ్చాక చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, సీనియర్ లీడర్లను పట్టించుకోకపోవడం, వైసీపీ నుంచి వచ్చిన లీడర్లకు కీలక పదవులు కట్టబెట్డడం, తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి వచ్చిన కింది స్థాయి కేడర్‌కు అవకాశం ఇవ్వకపోవడం ఇవన్నీ టీడీపీ చేసిన తప్పిదాలే.. దీంతో యాక్టివ్ కేడర్ మొత్తం నిరాశలోకి వెళ్లిపోయింది.
కొంతమంది పార్టీలు మారి వేరే పార్టీల కోసం పనిచేశారు. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణ ఓటమిని చవిచూసింది. మొన్నిమధ్య అసెంబ్లీలో వైసీపీ లీడర్ల మాటలకు చంద్రబాబు కంటనీరు పెట్టుకోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. ఈ చర్యతో టీడీపీ శ్రేణుల్లో కూడా భారీగా మార్పు వచ్చిందట.. ఎలాగైనా టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు నడుం బిగించారని తెలిసింది.
అంతకుముందు బాబు కూడా తాను చేసిన తప్పులు గుర్తించి ఈ సారి వలసలను ప్రోత్సహించనని, నిజమైన కార్యకర్తలను వదులుకోనని మాటివ్వడంతో తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా మార్పు సాధ్యమైందని టాక్.. ఇప్పటికే టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా వైసీపీ తప్పులను ఎండగట్టడం ప్రారంభించేశారట.. ఈ దూకుడు ఇలానే కొనసాగితే టీడీపీ మళ్లీ తిరిగి ఫామ్ లోకి రావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also : TDP-Janasena : టీడీపీ, జనసేన ఒక్కటయ్యేనా…? దీని వల్ల లాభం ఎవరికి..?