PV Sindhu: బాడ్మింటన్ ప్లేయర్ గా ఇండియాకు ఎన్నో పథకాలను తీసుకొచ్చిన ప్లేయర్ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.రెండుసార్లు ఒలంపిక్స్ లో పథకాలను సాధించి భారతదేశ కీర్తి ప్రతిష్టలను పెంచారు.ఇలా బ్యాడ్మింటన్ ప్లేయర్ గా ఎంతో గుర్తింపు పొందిన ఈమె కేవలం బ్యాడ్మింటన్ మాత్రమే కాకుండా తనలో మంచి డాన్సర్ కూడా ఉన్నారని నిరూపించుకుంటుంది.ఈ క్రమంలోనే తరచూ సోషల్ మీడియా వేదికగా ఈమె డాన్స్ చేస్తూ కొన్ని వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.
ఇప్పటికే బాగా ట్రెండ్ అయినటువంటి కచ్చా బాదాం పాటకు.. మాయాకిర్రియే పాటలకు డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ విధంగా పీవీ సింధు చేతిలో ఎప్పుడు బ్యాక్ పట్టుకొని ఉండడం చూసినా అభిమానులు ఇలా ఈమె డాన్స్ చేయడంతో ఒకసారి ఆశ్చర్య పోయారు. ఇదిలా ఉండగా తాజాగా మరొక డాన్స్ వీడియో ద్వారా ఈమె అభిమానుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఈమె మలేషియాలో ఉన్న విషయం మనకు తెలిసిందే.
మలేసియా ఓపెన్ సూపర్ 750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్లింది. క్వార్టర్ ఫైనల్స్ లో సింధు తాయ్ జు యింగ్ చేతిలో ఓటమి పాలయింది. అయితే తాను ఓడిపోయాననే విషయాన్ని కూడా ఈమె మర్చిపోయి పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక రీమిక్స్ పాటకు డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోని అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ నీకు ఏం చేయాలనిపిస్తే అది చేయండి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన ఎంతోమంది అభిమానులు పీవీ సింధులో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement