Weekly Horoscope : ఈ వారం అదృష్ట లక్ష్మి ఏ క్షణమైనా మీ తలుపు తట్టొచ్చు.. ఏయే రాశుల వారికి అదృష్టం ఎలా రాబోతుందో తెలుసా? 12 రాశుల వారికి ఈ వారంలో కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అదృష్ట లక్ష్మిని సొంతం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఫలితంగా ద్వాదశి రాశులవారు అనేక మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. అలాగే మిశ్రమ ఫలితాలు కూడా పొందే వీలుంది. ఏయే రాశుల్లో ఎవరికి ఈ వారం ఎంత అనుకూలంగా ఉందో ఓసారి చూద్దాం..
మేషం (మార్చి 21-ఏప్రిల్ 19) :
మీరు ఈ వారంలో సాహసపరమైన పనులను చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ప్రయాణాలు మీకు కలిసిరావొచ్చు. మీ పనులకు ఎవరూ అంతరాయం కలిగించలేరు. గతంలో మీరు చేసిన పనులకు ఈ వారంలో గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఈ వారం నుంచి మీకు మంచి కాలం ప్రారంభమవుతుంది. వచ్చే కొన్ని నెలల్లో మీ స్థానచలనం కలిగే అవకాశం ఉంది. మీకు నచ్చినవారి కోసం మీరు కొంత సమయాన్ని కేటాయిస్తారు. మీరు చేసే పని మీదే మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోగలమనే వాస్తవాన్ని మీరు తెలుసుకుంటారు.
వృషభం (ఏప్రిల్ 20-మే 20) :
ఏదైనా కొత్త పనులను ప్రారంభించేందుకు ఈ వారం బాగుంది. కొత్త విషయాలపై ఆసక్తి చూపిస్తారు. ఈ జీవితం సరైన మార్గంలోనే ఉంది. ప్రతిదానికి అసహనానికి గురికావొద్దు. రుణాలు చేసేందుకు ఈ వారం సరైన సమయం కాదు. మీరు వేసే చిన్న అడుగులు పెద్ద సమస్యలకు దారితీస్తాయి. వ్యాపారం పుంజుకుంటుంది. వృషభం వాళ్లు పాత సమస్య తొలగిపోయి స్వయం ఉపాధిని సంపాదించే అవకాశం ఉంది. గత తప్పిదాల నుంచి చాలా విషయాలను నేర్చుకుంటారు. కుటుంబ విషయాల పట్ల ఒకరితో ఒకరు చర్చించుకుంటారు. కొత్త ప్రయోగాలు చేయడానికి, కొత్తదాన్ని అన్వేషించడానికి ఈ వారమే మంచిదని గుర్తించుకోండి.
మిథునం (మే21-జూన్ 20) :
మీకు కావాల్సినవి పొందగల సామర్థ్యం మీకు ఉంది. ఆ విషయంలో మీకు మీపై నమ్మకం, క్లారిటీ ఉండాలి. మీలో శక్తి స్థాయిలు ఎక్కువే. కానీ, సరైన దారిలో మలుచుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఈ వారమంతా సరదా సరదాగా సాగిపోవచ్చు. కొత్త వ్యాపారాలపై దృష్టిపెట్టేందుకు సరైన సమయం.. మీ ఏదైనా పని పూర్తి చేసేందుకు ప్రయత్నించే సమయంలో అనుకోని పనులు మీద పడొచ్చు. ఫలితంగా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఇక డబ్బు వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మీరు చర్చించే అంశాలు సానుకూలంగా ముగుస్తాయి.

Weekly Horoscope April 3 to April 9 : Your luck for this week, see which signs have luck for them
కర్కాటకం (జూన్ 21-జూలై 22) :
మీరు వేసే అడుగుల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ వ్యక్తిగత విషయాలన్నింటిని ఇతరులతో చర్చించడంలో జాగ్రత్త వహించండి. అన్ని రకాల కమ్యూనికేషన్ల విషయానికి వస్తే జాగ్రత్తగా ఉండాల్సిన వారమిది.. ప్రస్తుతానికి మీ అభిప్రాయాలను మీలో ఉంచుకోండి. మీపై ద్వేషపూరిత వ్యక్తి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఒక చిన్న ఆలోచన మీకు దారి చూపిస్తుంది. ప్రత్యేకించి మీరు పెట్టుబడి పెట్టేందుకు లేదా కెరీర్‌లను మార్చుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఈ వారం చాలా మంచిది. మీడియా, విద్యపరంగా ఉన్న వారికి మంచి వారంగా చెప్పవచ్చు. మీ ఇంట్లో అపార్థాలు పెరగవచ్చు. మీకు తెలియకుండానే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించవచ్చు. ఆరోగ్య విషయాలు బాగానే ఉంటాయి. అయినప్పటికీ జాగ్రత్త తప్పనిసరి..
సింహ రాశి (జూలై 23-ఆగస్ట్ 22) :
మంచితనం విషయంలో మీకు మీరే చాటి.. మీ కుటుంబం, స్నేహితులు, మీ పని పట్ల ఎక్కువగా శ్రద్ధను చూపిస్తారు. మీలో నాయకత్వ సామర్థ్యాలతో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. మీకు ఎదురుకాబోయే చిన్న సమస్యను మీరు పరిష్కరించాల్సి రావొచ్చు. అన్ని రకాల పరిస్థితులను హ్యాండిల్ చేయగల సామర్ధ్యం మీలో ఉంది. అదే మీకు విజయం సాధించేలా చేస్తుంది. కాబట్టి మీరూ నిరుత్సాహపడకండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో ఓపిక చాలా అవసరమని గుర్తించాలి. ఫైనాన్స్ పరంగా నమ్మకమైన విషయాలపై మీకు స్పష్టత వస్తుంది. మీ పనులు వేగవంతమవుతాయి. మీరు పెళ్లి కోసం చూస్తున్నట్లయితే.. వచ్చే నెలల్లో ఆ గడియలు రానున్నాయి. కొన్ని పనుల్లో అధిక శ్రమ పడాల్సి రావొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22) :
మీ ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉంటాయి. మీరు చిత్తశుద్ధితో పని చేస్తారు. మీ కర్మ సూచించినట్లుగా అన్నీ చక్కగా సాగుతాయి. రాబోయే రోజుల్లో మీ ఆలోచనలు, మీరు చేసే పనులను గుర్తుంచుకోండి. ఎదురయ్యే పరిస్థితిని విమర్శించడం మానేసి మీ మనస్సుతో సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించండి. ప్రస్తుతం ఏమి జరుగుతుందో మీరు దృష్టి పెట్టరు. కానీ, ఏమి జరుగుతుందనే దానిపైనే ఎక్కువగా ఆందోళన చెందుతారు. తద్వారా అనారోగ్య సమస్యలకు దారితీయొచ్చు. ప్రియమైనవారితో రాజీ పడేందుకు వెనకాడొద్దు. మీరు ఇష్టపడే వ్యక్తులతో ఎంత నిజాయితీగా ఉంటారో అదే మీకు మేలు చేస్తుంది. పెద్దలతో సమయం గడపడం మీకు సంతృప్తిని కలిగిస్తుంది. మీ జీవితంలో నిజంగా మీకు ఏమి కావాలో వాటిని గుర్తు చేస్తుంది.
తుల (సెప్టెంబర్ 23-అక్టోబర్ 22) :
మీలో అందంపై ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది. కళ, రంగు, ప్రకృతి అందాలపై మక్కువ చూపిస్తారు. మీ క్రియేటివిటీని బయటకి తీయండి. మీకు నచ్చిన పాత విషయాలపై దృష్టిపెట్టండి. ఆర్టిస్టులు, డిజైనర్లు, యానిమేటర్‌లు, ఐడియేటర్‌లు, ఆర్కిటెక్ట్‌ల్లో మంచి ఆలోచనలతో మంచి దశ ప్రారంభమవుతుంది. అయితే, ఆర్థిక పరంగా మీరు ఎవరిని నమ్ముతున్నారో, ఏదైనా సంతకం చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత పశ్చాత్తాపం పడినా ప్రయోజనం ఉండదు. ఏదైనా ఖర్చు చేయడానికి ముందు కొంత సమయాన్ని వెచ్చించండి. మీరు అప్పు ఇచ్చిన వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేసుకోవడంలో కొంత ఇబ్బందులు ఏర్పడొచ్చు. మీ జీవితంలోని ఇతర అంశాలపై దృష్టి పెట్టడానికి కొంత విరామం తీసుకోవడం మంచిది.
వృశ్చిక రాశి (అక్టోబర్ 23-నవంబర్ 21) :
మిమ్మల్ని ఇబ్బందిపెట్టే విషయాలకు బదులుగా ఆ సమస్యలను ధీటుగా ఎదుర్కోండి. ఆ సమస్యలను తప్పించుకోవడానికి ఇప్పుడు సరైన సమయం కాదు. మీ సమస్య పరిష్కారం దొరికేంతవరకు రాబోయే రోజుల్లో మీరు సంబంధిత అంశాలపై దీర్ఘకాలంగా చర్చలు జరగొచ్చు. మీరు తెలిసో తెలియకో ఏదైనా తప్పు చేయాల్సి వస్తే.. ఆ తప్పును నిర్భయంగా అంగీకరించేందుకు వెనుకాడొద్దు. అది మీకు భవిష్యత్తులో మరో కొత్త మార్గాన్ని చూపించే అవకాశం ఉంది. మీ విధానం ఎంత సూటిగా ఉంటే.. మీ భవిష్యత్తు అంతా ప్రకాశవంతంగా తేలికగా ఉంటుంది.
ధనుస్సు (నవంబర్ 22-డిసెంబర్ 21) :
మీ జీవితం.. మీ ఇల్లు.. మీ పుణ్యక్షేత్రం. మీ సాదరమైన ఆతిథ్యానికి ఎవరైనా ఆకర్షితులవుతారు. రాబోయే రోజుల్లో మీరే పార్టీ లేదా ఈవెంట్‌ని హోస్ట్ చేసే స్థితికి చేరుకోవచ్చు. మీరు ఇతరుల కోసం పనులు చేసినప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ ఆఫీసులో పనుల జాప్యానికి మెరుగైన సమయ నిర్వహణ అవసరం కావచ్చు. మీకు డబ్బు అప్రయత్నంగానే చేతికి అందుతుంది. బహుమతులు అందుకుంటారు. మీ జీవితంలో మీకోసం కొంత సమయాన్ని గడిపేందుకు ఆసక్తి చూపుతారు.
మకరం (డిసెంబర్ 22-జనవరి 19) :
ప్రస్తుత వారంలో మీ సొంత ఆలోచనలు పెద్దగా లాభించవు. ఒకరు చెప్పేది వినడం చేయడం తప్పా మీకు వేరే మార్గం లేదు. నిర్లక్ష్యంగా ఏదైనా చేసే సమయం కాదు.. మీరు కొన్నిరోజులు ఓపికగా ఉండాల్సిన సమయం.. ఏదైనా హఠాత్తుగా చేసే పని విషయంలో వెనక్కి తగ్గడమే మేలు. కొందరి వ్యక్తుల మాటలు మిమ్మల్ని నిరాశపరచవచ్చు. మీరు వారి నుంచి చాలా ఎక్కువగా ఆశించి ఉండవచ్చు. మీ స్నేహం మధ్యలోనే ఆగిపోవచ్చు. ఓ కొత్త జాబ్ ఆఫర్ మిమ్మల్ని ఎక్కువ సమయం ఎదురుచూసేలా చేయొచ్చు. ఏదైనా దూర ప్రయాణాలకు కుటుంబ సమేతంగా వెళ్లేందుకు అవకాశం ఉంది. అయితే వేసవి కాలంలో అలెర్జీలు లేదా ఎండల ప్రభావం పడే అవకాశం ఉంది.. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.
కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18) :
మీ దృష్టి మీపై అవసరాలపై ప్రభావం చూపుతుంది. మీ కోసం మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారో ఆలోచించుకోండి. మీ ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహిస్తారు. ప్రత్యేకించి.. మీరు గత కొన్ని వారాల్లో డబ్బు విషయంలో చేసిన పొరపాట్లను గుర్తు చేసుకోండి. అధిక శ్రమను చేసే కుంభరాశివారు కొన్ని విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. మీ వ్యక్తిగత విషయానికి వస్తే.. మీకు ఎవరో ఏదో చేస్తారని ఆశించడాన్ని వదిలివేయండి. గుడ్డిగా ఏది నమ్మవద్దు. మీ అవసరాలను ఇతరులతో చర్చిస్తే.. అనుకున్నదానికంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
మీనం (ఫిబ్రవరి 19-మార్చి 20) :
జీవితంలో ఒకే అవకాశం ఎప్పుడూ రెండుసార్లు తలుపు తట్టదు. మీకు మంచి గడియలు మొదలయ్యాయి. మీరు అనుకున్న పనులను నెరవేర్చుకునేందుకు సమయం ఆసన్నమైంది. మీరు ప్రమోషన్ వంటి శుభవార్త వింటారు. అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశం ఉంది. పెళ్లి వేడుకల్లో పాల్గొంటారు. కొత్త విషయాలపై దృష్టిపెడతారు. మీరు ఎవరి ప్రవర్తనపై వ్యక్తిగత విమర్శలు చేయరాదు. మీలో సంకల్ప శక్తి బలపడుతుంది. మీ ఆరోగ్యానికి చెడు చేసే అలవాట్లు లేదా విలాసాలు వదిలించుకోవడానికి ఇదే సరైన సమయం.
Read Also : Zodiac Signs : వృషభ రాశి వారికి ఏప్రిల్ నెల గ్రహచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే..!