Vikram Movie Review : విలక్షణ నటుడు, లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ విజయ్ సేతుపతి, సూర్య ముగ్గురు కలిసి లీడ్ రోల్స్ చేసిన మూవీ విక్రమ్.. ఈ సినిమా జూన్ 3న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెద్ద హీరోలు నటించడంతో విక్రమ్ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. మరికొన్ని గంటల్లో విక్రమ్ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. అయితే విక్రమ్ మూవీపై టాక్ కూడా పాజిటివ్ గానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సినీ రిలీజ్ కావడానికి ముందే ఉదయనిధి స్టాలిన్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. తన ట్విట్టర్ వేదికగా విక్రమ్ మూవీ ఎలా ఉందో చెప్పేశారు.

తమిళనాడులో ఉదయ్ నిధిస్టాలిన్ కోసం విక్రమ్ మూవీ స్పెషల్ షో కూడా వేశారు. ఆ మూవీ చూసిన వెంటనే ఆయన విక్రమ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అంటూ ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. కమల్ హాసన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విక్రమ్’ అద్భుతంగా వచ్చిందన్నారు. ఇక డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.
ఉదయ్ స్టాలిన్ ఫస్ట్ రివ్యూపై కమల్ హాసన్ స్పందించారు. విక్రమ్ మూవీ ప్రజాదారణ పొందుతుందనే విశ్వాసం మరింత పెరిగిందని, స్టాలిన్ ఫస్ట్ రివ్యూ ఇచ్చినందుకు కమల్ ధన్యవాదాలు తెలిపారు. అభిమానిగా మీరేంటో నిరూపించారు. మీ రివ్యూతో మరింత మందిలోనూ ఆసక్తిని పెంచుతుందని భావిస్తున్నాను.

ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీని దర్శకుడు లోకేశ్ కనకరాజ్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సంగీత దర్శకుడు అనిరుధ్ అందరూ కలిసి అద్భుతంగా తెరకెక్కించారు. నిజంగా విక్రమ్ మూవీ మంచి అనుభూతిని ఇచ్చింది. కచ్చితంగా ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అవుతుందని ఆయన ట్వీట్ చేశారు. ఈ మూవీలో సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
Dear @Udhaystalin thambi. Thanks for your glowing first view report on #Vikram . You had proclaimed yourself as a fan. Your report will enthuse all my other brothers to dizzying heights. @RKFI @turmericmediaTM #VikramHitlist https://t.co/IbeclwXCu8
Advertisement— Kamal Haasan (@ikamalhaasan) June 1, 2022
Advertisement

Read Also : Major Movie Review : ’మేజర్‘ మూవీ ఫుల్ రివ్యూ.. ప్రతి భారతీయుడిని కదిలించే సినిమా..!