Vijayendra Prasad: రాజమౌళి దర్శకత్వంలో పాన్ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బృందానికి సంబంధించిన ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సినిమాపై అంచనాలను పెంచారు.
ఇలాంటి అద్భుతమైన కథ ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణమైన సినీ రచయిత విజయేంద్రప్రసాద్ మాత్రం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.ఈ విధంగా ఈయన దూరంగా ఉండటానికి సరైన కారణం తెలియకపోయినప్పటికీ తాజాగా విజయేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ గురించి ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్వ్యూ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు మంచి స్నేహితులుగా కనిపిస్తారు. సినిమా మొదట్లోనే వీరిద్దరు విభిన్న మనస్తత్వాలు కలిగిన వారిగా మనకు కనబడతారు. ఇలా భిన్న ధ్రువాలు ఎలా ఉన్న వీరు ఎక్కడో ఒక చోట డీ కొడతారనే విషయం అందరికీ తెలుస్తుంది. అలాగే వీరిద్దరి మధ్య ఒక ఫైట్ సన్నివేశం జరుగుతుంది. ఈ ఫైట్ సన్నివేశం చూస్తే ఎవరికైనా రెండు సింహాలు పోట్లాడుతూ ఉంటే చూడటానికి ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ ఈ సన్నివేశం చూసినప్పుడు నాకు కన్నీళ్లు ఆగలేదు. ఈ సినిమాని ఇప్పటికే ఐదు సార్లు చూశానని, ఈ ఐదు సార్లు తనకు కన్నీళ్లు ఆగలేదని ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World